Indian Railway: చెప్పు తీసుకుని ఓ కుర్రాడిని చితకబాదిన యువతి.. రైల్లో అందరూ చూస్తుండగానే..!
ABN , First Publish Date - 2023-11-25T17:02:12+05:30 IST
బస్సు, రైలు ప్రయాణ సమయాల్లో మహిళలకు అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు సీటు కోసం యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఎదురైతే.. ఇంకొన్నిసార్లు సీటు దొరికినా.. తోటి ప్రయాణికుల కారణంగా అనేక రకాల సమస్యలు ఎదురవుతుంటాయి. అయినా..
బస్సు, రైలు ప్రయాణ సమయాల్లో మహిళలకు అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు సీటు కోసం యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఎదురైతే.. ఇంకొన్నిసార్లు సీటు దొరికినా.. తోటి ప్రయాణికుల కారణంగా అనేక రకాల సమస్యలు ఎదురవుతుంటాయి. అయినా చాలా మంది మహిళలు సర్దుకుపోతుంటారు. అయితే కొందరు మాత్రం ధైర్యంగా ఎదురుతిరుగుతుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. రైల్లో ఓ వ్యక్తి పిచ్చి చేష్టలతో యువతి విసిగిపోయింది. చివరకు ఏం చేసిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. రైలు బోగీ ప్రయాణికులతో రద్దీగా ఉంది. కొందరికి కూర్చోవడానికి సీటు కూడా లేదు. ఓ యువతికి సీటు దొరికినా ఎదురుగా ఉన్న వ్యక్తి కారణంగా ఊహించని సమస్య వచ్చి పడింది. యువతిని (young woman) చూడగానే అతడిలోని శాడిస్టు బయటికొచ్చాడు. కావాలనే ఆమెను పదే పదే విసిగిస్తూ, అసభ్యకర చేష్టలతో (Indecent behavior) బాగా ఇబ్బంది పెట్టాడు. అయినా ఆమె చాలా సేపు ఓపిగ్గా భరించింది. ఆమె సైలెంట్‌గా ఉండడంతో అతను మరింతగా రెచ్చిపోయాడు. దీంతో చివరికి యువతికి కోపం కట్టలు తెంచుకుంది. ఏమైతే అదవుతుంది.. అని అనుకుంటూ పైకి లేచి చెప్పు తీసుకుని అతడి సమీపానికి వెళ్లింది.
అతడి వద్దకు వెళ్లగానే క్షణం కూడా ఆలస్యం చేయకుండా చెప్పుతో పదే పదే అతడిని చితకబాదింది. యువతి రియాక్షన్‌తో ఖంగుతిన్న అతను.. దయచేసి వదలండి.. అంటూ వేడుకున్నాడు. అయినా యువతికి కోపం తగ్గలేదు. చొక్కా పట్టుకుని ‘‘ఇంకోసారి ఎప్పుడైనా ఇలా చేస్తావా’’.. అంటూ మళ్లీ చెప్పుతో కొట్టింది. ఈ ఘటనతో చుట్టు పక్కల ఉన్న ప్రయాణికులంతా అక్కడ గుమికూడారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి వారికి అలాగే బుద్ధి చెప్పాలి’’.. అని కొందరు, ‘‘యువతి ధైర్యానికి హ్యాట్సాప్’’.. అంటూ మరికొందరు. వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.