Wahab: అంతర్జాతీయ క్రికెట్‌కు వాహబ్ గుడ్‌బై
ABN , First Publish Date - 2023-08-17T04:00:07+05:30 IST
పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ వాహబ్ రియాజ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. విశ్వవ్యాప్తంగా జరుగుతున్న టీ20 లీగ్‌లపై దృష్టి సారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు 38 ఏళ్ల వాహబ్ బుధవారం ప్రకటించాడు.

కరాచీ: పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ వాహబ్ రియాజ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. విశ్వవ్యాప్తంగా జరుగుతున్న టీ20 లీగ్‌లపై దృష్టి సారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు 38 ఏళ్ల వాహబ్ బుధవారం ప్రకటించాడు. తన పన్నెండేళ్ల కెరీర్‌లో 27 టెస్టులు, 91 వన్డేలు, 36 టీ20లాడిన వాహబ్.. వరుసగా 83, 120, 34 వికెట్లు పడగొట్టాడు.