Share News

Vivo Z100 Series: భారత్‌లో వివో ఎక్స్100 సిరీస్ ఫోన్ విడుదల తేదీ ఖరారు.. ఫీచర్లు ఇవే

ABN , Publish Date - Dec 27 , 2023 | 03:03 PM

భారత్‌లో వివో ఎక్స్100 (Vivo Z100 Series) స్మార్ట్‌ఫోన్ విడుదల తేదీ ఖరారైంది. జనవరి 4న విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది. వివో ఎక్స్100, వివో ఎక్స్100 ప్రో రెండు మోడల్స్‌ను విడుదల చేయనున్నట్టు స్పష్టం చేసింది.

Vivo Z100 Series: భారత్‌లో వివో ఎక్స్100 సిరీస్ ఫోన్ విడుదల తేదీ ఖరారు.. ఫీచర్లు ఇవే

భారత్‌లో వివో ఎక్స్100 (Vivo Z100 Series) స్మార్ట్‌ఫోన్ విడుదల తేదీ ఖరారైంది. జనవరి 4న విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది. వివో ఎక్స్100, వివో ఎక్స్100 ప్రో రెండు మోడల్స్‌ను విడుదల చేయనున్నట్టు స్పష్టం చేసింది. మోడల్ ఈ మేరకు వివో ఇండియా వెబ్‌సైట్‌లో ప్రకటన చేసింది. సరికొత్త ఎక్స్ సిరీస్ స్మార్ట్‌ఫోన్లకు ఇది ప్రారంభం కానుందని వెల్లడించింది. కాగా వివో ఎక్స్100, వివో ఎక్స్100 ప్రో ఈ రెండు నవంబర్ నెలలోనే చైనాలో విడుదలయ్యాయి. తాజాగా భారత్‌తో పాటు అంతర్జాతీయంగా ఎంపిక చేసిన పలు దేశాల్లో ఈ ఫోన్లు మార్కెట్‌లోకి రాబోతున్నాయి. కాగా ఈ ఫోన్లు మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ఎస్‌వోసీ చిప్‌, 8టీ ఎల్‌టీపీవో డిస్‌ప్లేతో ఈ ఫోన్లు అందుబాటులోకి రాబోతున్నాయి. ఫ్రంట్ కెమెరా యూఎస్‌పీ ప్రధాన హైలెట్‌గా ఉంది. బ్యాక్‌లో మూడు కెమెరాలతో ర


కెమెరా ముందు భాగంలో యూఎస్‌పీ పరికం ప్రధాన హైలైట్‌గా ఉంది. ఇక 50-మెగాపిక్సెల్, 1-ఇంచ్ టైపు షూటర్ ప్రధానంగా బ్యాక్ కెమెరా పనిచేయనుంది. ఇక భారత్‌లో లభ్యం కానున్న వివో ఎక్స్100 (Vivo X100), వివో ఎక్స్100 ప్రో (Vivo X100 Pro) ఫోన్లు మూడు వేరియెంట్ రంగులు ఆస్టరాయిడ్ బ్లాక్, సన్‌సెట్, స్టార్‌ట్రైల్ బ్లూలలో లభిస్తాయి. ఐపీ68-రేటెడ్ బిల్డ్, ఫన్‌టచ్ ఓఎస్ 14 (Funtouch OS 14), జీస్ (Zeiss) బ్రాండెడ్ ట్రిపుల్ రియర్ కెమెరాలు, మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ఎస్‌వోసీ, వీ3 ఇమేజింగ్ చిప్, 8టీ ఎల్‌టీపీవో (8T LTPO) డిస్‌ప్లేలు ఇతర ముఖ్యమైన ఫీచర్లుగా ఉన్నాయి. ఇక ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు 6.78-అంగుళాల 8 ఎల్‌టీపీవో అమోల్డ్ డిస్‌ప్లేను (LTPO AMOLED) కలిగి ఉంటాయి.

Updated Date - Dec 27 , 2023 | 03:03 PM