Google timeline: గూగుల్ టైమ్‌లైన్‌లో మార్పులు..ఈ విషయాలు తెలుసుకోకపోతే మీ డేటా డిలీట్
ABN , Publish Date - Dec 16 , 2024 | 07:08 PM
త్వరలో గూగుల్ మ్యాప్‌ల నుంచి తొలగిపోనున్న లొకేషన్ హిస్టరీ. శాశ్వతంగా కోల్పోకూడదంటే యూజర్లు ఏం చేయాలంటే..
గూగుల్ మ్యాప్‌ల నుంచి లొకేషన్ హిస్టరీ తొలగించబోతున్నట్టు టెక్ జెయింట్ గూగూల్ గతేడాదే ప్రకటించింది. చివరి గడువు డిసెంబర్ 1,2024 వ తేదీని అని చెప్పినా, మరో ఆరు నెలలపాటు పొడిగించాలని నిర్ణయించుకుంది. మెయిల్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా యూజర్లను అప్రమత్తం చేస్తోంది. గడువులోగా యూజర్స్ గూగుల్ టైమ్‌లైన్ ఫీచర్‌లోని డేటా సేవ్ చేసుకోకపోతే శాశ్వతంగా డిలీట్ అయిపోతుందని సూచిస్తోంది. చివరి గడువును జూన్ 9 2025 గా నిర్థారించింది.
టైం లైన్ అంటే?
గూగుల్ మ్యాప్స్‌లో టైమ్‌లైన్ పర్సనల్ మ్యాప్‌లాంటిది. మనం గతంలో వెళ్లిన దారులు, ప్రాంతాలు గుర్తుచేసేందుకు ఉపయోగపడుతుంది. జియోగ్రఫిక్ డైరీలాగా అన్నమాట. ఈ డేటాను మనకు మాత్రమే కనిపించేలానూ సెట్ చేసుకోవచ్చు. అలాగే టైమ్‌లైన్‌ని ఎడిట్, లొకేషన్ హిస్టరీని కూడా డిలీట్ చేయవచ్చు.
ఏం మారబోతోంది?
గతంలో అందరి డేటా క్లౌడ్ ద్వారా నిక్షిప్తం చేసేది గూగుల్ సంస్థ. ఇప్పుడు అందుకు బదులుగా స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతిఒక్కరి డేటాను వేర్వేరుగా సేవ్ చేయనుంది. మూడు నెలల క్రితం సందర్శించిన ప్రాంతాలు, ట్రిప్‌ల వివరాలు ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోయేలా మార్పులు తీసుకొచ్చింది. గతంలో లొకేషన్ హిస్టరీలోని ట్రిప్ వివరాలను త్వరగా సేవ్ చేసుకోవాలని యూజర్లను అప్రమత్తం చేస్తోంది. ఇందుకు ఆరు నెలల సమయమే మిగిలి ఉంది. ఒకవేళ గడువులోగా యూజర్లు తమ డివైజ్‌లోని డేటాను సేవ్ చేసుకోకపోతే, అది మరే వెబ్ బ్రౌజర్లలోనూ యాక్సెస్ కాదు. గూగుల్ చెప్పిన ప్రకారం, టైంలైన్ డేటా స్మార్ట్‌ఫోన్‌లో తప్ప కంప్యూటర్ వెబ్‌బ్రౌజర్లలో లభించదు.
డేటా ఎలా సేవ్ చేసుకోవాలంటే?
యూజర్ల గోప్యతను పెంచేందుకు ఈ సర్వీస్ ప్రవేశపెట్టింది గూగుల్. దీంతో చాలామంది ఏళ్లనాటి ముఖ్యమైన ట్రిప్‌లకు సంబంధించిన డేటా ఎక్కడ కోల్పోతామోనని కంగారుపడుతున్నారు. ఈ కింది పద్ధతులు పాటించి డేటాను సురక్షితంగా కాపాడుకోవచ్చు.
1. ముందుగా సెట్టింగ్స్‌ని అప్‌డేట్ చేసుకోవాలి.
2. గూగుల్ మ్యాప్ వర్షన్ 11.106 ,ఆండ్రాయిడ్ 6.0 ఉండేలా చూసుకోవాలి.
3. యాప్ ఓపెన్ చేసి 'ఎక్స్‌ప్లోర్ టైమ్‌లైన్'పై క్లిక్ చేయాలి.
4.ఎన్ని నెలల డేటా కావాలో సెలక్ట్ చేసుకోవాలి.
5. యూజర్ డేటా గూగల్‌కు పంపేందుకు 'కంటిన్యూ' ఆప్షన్ ఎంచుకోవాలి.
6.డన్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
బ్యాకప్ టైంలైన్ డేటా
ఒకవేళ కొత్త డివైజ్ వాడుతుంటే ఎలా అనే డౌట్ రావచ్చు. పాత డివైజ్ నుంచి కొత్తదానికి స్విచ్ అయిన వెంటనే ఆటోమేటిక్‌గా టైమ్‌లైన్ డేటా బ్యాకప్ అయిపోతుంది. గూగుల్ సర్వర్లకు డేటా కాపీ ఎన్‌క్రిప్ట్ కావడం ద్వారా కొత్త డివైజ్‌లోకి ఇంపోర్ట్ అవుతుంది. సెట్టింగ్స్‌లోని ఇంపోర్ట్ బ్యాకప్ క్లిక్ చేస్తే సరి.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here