Share News

CM KCR: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు ఉరే

ABN , First Publish Date - 2023-11-26T16:52:47+05:30 IST

కాంగ్రెస్ పార్టీ ( Congress party ) తెలంగాణలో అధికారంలోకి వస్తే రైతులకు ఉరేనని సీఎం కేసీఆర్ ( CM KCR ) అన్నారు. ఆదివారం నాడు జగిత్యాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

CM KCR:   కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు ఉరే

జగిత్యాల: కాంగ్రెస్ పార్టీ ( Congress party ) తెలంగాణలో అధికారంలోకి వస్తే రైతులకు ఉరేనని సీఎం కేసీఆర్ ( CM KCR ) అన్నారు. ఆదివారం నాడు జగిత్యాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ...‘‘ తెలంగాణ రాష్ట్రం సురక్షితంగా ఉండాలంటే బీఆర్ఎస్‌కు ఓటు వేయండి. 58 ఏళ్లు ఉమ్మడి రాష్ట్రం పాలనలో ఏడ్చినం. తెలంగాణను ముంచింది కాంగ్రెస్సే. ఆంధ్రా నేతలు కంటే తెలంగాణ కాంగ్రెస్స్ నేతలు రాష్ట్రాన్ని ముంచారు. వరద కాలువకు నాలుగు తూములు పెట్టలేదు.. కత్తి ఆంధ్రోడిదే..కానీ పొడిచింది మాత్రం తెలంగానోడే. కాంగ్రెస్ పార్టీది అవకాశ వాదం తప్ప పోరాటం కాదు. నాకంటే పొడుగు, అడ్డం ఉన్నోడు మంచి నీళ్లు కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ ది భూమాత కాదు భూమేత’’ అని సీఎం కేసీఆర్ ఎద్దేవ చేశారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - 2023-11-26T17:13:20+05:30 IST