Share News

Cm Revanth: తొలి రోజే.. ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు

ABN , First Publish Date - 2023-12-08T03:31:26+05:30 IST

సీఎంగా ప్రమాణస్వీకారం చేసే నేత.. ఆరోజు చాలా రిలాక్స్‌డ్‌గా ఉంటారు! కానీ.. అంతటి కీలకమైనరోజున రేవంత్‌ దూకుడు చూసి కాంగ్రెస్‌ నేతలే అవాక్కయ్యారు!! పొద్దున్నే విమానాశ్రయానికి వెళ్లి పార్టీ అగ్రనేతలను సాదరంగా ఆహ్వానించడం..

Cm Revanth: తొలి రోజే.. ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు

  • తొలిరోజే అదరగొట్టిన రేవంత్‌.. వరుస నిర్ణయాలు.. ప్రత్యర్థులపైనా గురి

సీఎంగా ప్రమాణస్వీకారం చేసే నేత.. ఆరోజు చాలా రిలాక్స్‌డ్‌గా ఉంటారు! కానీ.. అంతటి కీలకమైనరోజున రేవంత్‌ దూకుడు చూసి కాంగ్రెస్‌ నేతలే అవాక్కయ్యారు!! పొద్దున్నే విమానాశ్రయానికి వెళ్లి పార్టీ అగ్రనేతలను సాదరంగా ఆహ్వానించడం.. ఆ వెంటనే ప్రమాణ స్వీకారం! దానికి ముందే.. ప్రగతిభవన్‌ వద్ద బారికేడ్లు, కంచె తొలగింపు పనుల ప్రారంభం! ఆరు గ్యారెంటీల అమలు ఫైలుపైన.. కుమ్మరి రజని అనే దివ్యాంగురాలికి ఉద్యోగం ఇచ్చే ఫైలుపైన సంతకం. అనంతరం ఎయిర్‌పోర్టు దాకా వెళ్లి సోనియా, రాహుల్‌, ప్రియాంకకు వీడ్కోలు. సెక్రటేరియట్‌లో బాధ్యతలు చేపట్టగానే.. క్యాబినెట్‌ భేటీ! అందులో విద్యుత్తు అధికారులపై ఆగ్రహం. రాష్ట్ర ఆర్థిక స్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయం.. ఇలా చాలా పనులు చేశారాయన.

  • అంతేనా.. సీఎంవో ముఖ్య కార్యదర్శిగా శేషాద్రిని.. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా శివధర్‌రెడ్డిని నియమించారు.

  • కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా జోడేఘాట్‌లో డబుల్‌ ఇళ్ల పనుల పురోగతిపై కలెక్టర్‌తో నివేదిక తెప్పించుకున్నారు.

  • హనుమకొండ జిల్లాలోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ స్వగ్రామమైన అక్కంపేటను రెవెన్యూ గ్రామంగా ప్రకటించారు.

  • ఆర్మూర్‌లోని జీవన్‌రెడ్డి మాల్‌ అండ్‌ మల్టీప్లెక్స్‌ ఆర్టీసీకి రూ.7-8 కోట్లు బకాయి పడడంతో ఆర్టీసీ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు, సిబ్బంది గురువారం నోటీసులు జారీ చేశారు.

    9Mall-NZB.jpg

2fencing1.jpg

ra-2.jpg

Updated Date - 2023-12-08T11:09:40+05:30 IST