OTT: ఈ వారమే విడుదల
ABN , Publish Date - Apr 13 , 2025 | 01:54 AM
ఈ వారం నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, హాట్‌స్టార్, సోనీ లివ్‌లలో పలు వెబ్‌సిరీస్‌లు, సినిమాలు విడుదల కానున్నాయి. ముఖ్యంగా హారర్ ప్రేమికులను ఆకట్టుకునే ‘ఖౌఫ్’ హైప్ క్రియేట్ చేస్తోంది

ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు
ఖౌఫ్
హారర్ చిత్రాలు, వెబ్‌సిరీ్‌సలకు ఇటీవల కాలంలో ప్రేక్షకాదరణ అమితంగా దక్కుతోంది. ఈ కోవలో వస్తోన్న మరో భయానక బీభత్స ప్రధానమైన హిందీ సిరీస్ ‘ఖౌఫ్’. ఓ మహిళల హాస్టల్‌లో జరిగే సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన సూపర్ నేచురల్ హారర్ సిరీస్ ఇది. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే కోరికతో ఢిల్లీ వచ్చిన మాధురి జీవితంలో జరిగిన అనూహ్య సంఘటనల నేపథ్యంలో సాగుతుంది.
ఓ పాడుపడిన హాస్టల్‌లో చేరినప్పటి నుంచి ఆమె జీవితం నరకప్రాయమవుతుంది. అక్కడి నుంచి బయటపడేందుకు ఆమె చేసే ప్రయత్నాలు మరింత కష్టాల్లోకి నెడతాయి. హాస్టల్ గేట్ దాటి బయట అడుగుపెట్టలేని నిస్సహాయ పరిస్థితుల్లో చివరకు ఏం జరిగింది అనేది కథ. హారర్ ప్రియులకు కొత్త తరహా అనుభూతిని ఇచ్చేలా ‘ఖౌఫ్’ తెరకెక్కిందని ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Minister Kollu Ravindra: కులాలు, మతాల మధ్య చిచ్చుపెడితే.. మంత్రి కొల్లు రవీంద్ర మాస్ వార్నింగ్..
South Central Railway: గుడ్ న్యూస్ చెప్పిన దక్షిణ మధ్య రైల్వే.. ఆ ప్రాంతాల్లో ప్రత్యేక రైళ్లు..