Telangana Election Result: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం
ABN , First Publish Date - 2023-12-03T08:00:26+05:30 IST
Telangana Elections Results: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరుగనుంది. తెల్లవారుజామున 5 గంటలకే కౌంటింగ్ కేంద్రాలకు మొదట పోస్టల్, సర్వీస్ ఓట్లను అధికారులు లెక్కించనున్నారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ (Telangana Elections Counting) ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరుగనుంది. తెల్లవారుజామున 5 గంటలకే కౌంటింగ్ కేంద్రాలకు మొదట పోస్టల్, సర్వీస్ ఓట్లను అధికారులు లెక్కించనున్నారు. ఉదయం 8.30 గంటల నుంచి ఈవీఎం ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఓట్ల లెక్కింపు కోసం 119 స్థానాల్లో 1,798 టేబుళ్లు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని 119 స్థానాల్లో 2,417 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగనుంది. రాష్ట్ర వ్యాప్తం మొత్తం లక్షా 80 వేల పోస్టల్ ఓట్లు పోలయ్యాయి. ప్రతి 20 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం వచ్చే అవకాశం ఉంది. వేగంగా ఫలితాలు ఇచ్చేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సిద్ధం చేశారు. ఒక్కొక్క నియోజకవర్గానికి 14 టేబుల్స్‌ను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో లెక్కింపు ప్రక్రియ జరుగనుంది. తెలంగాణలో మొత్తం ఓట్ల సంఖ్య 3,26,02,793 కాగా.. 2,32,59,256 మంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకున్నారు. తెలంగాణలో 79 నియోజకవర్గాల్లో 75% ఓటింగ్ నమోదు అయ్యింది. మొదటి ఆధిక్యం ఉ.10.30 ప్రాంతంలో తెలిసే అవకాశం ఉంది. చిన్న నియోజకవర్గాల్లో ఉదయం 10.30కు తొలిరౌండ్ ఫలితాలు వెల్లడికానున్నాయి. మొత్తం 49 ప్రాంతాల్లో లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఇటు హైదరాబాద్ జిల్లాలో 14 ప్రాంతాల్లో కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేశారు. రంగారెడ్డి జిల్లాలో 4 ప్రాంతాలు, నిజామాబాద్ జిల్లాలో 2 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు జరిగాయి. వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఒకే చోట కౌటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. 28 జిల్లాల్లో ఓట్ల లెక్కింపునకు ఒక్కో చోట కౌటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల దగ్గర మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. లెక్కింపు కేంద్రాల దగ్గర 40 కంపెనీల కేంద్ర బలగాలతో భద్రత కల్పించారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్‌పై మైక్రో అబ్జర్వర్, సూపర్‌వైజర్, ఇద్దరు అసిస్టెంట్లను నియమించారు.
నేడు తేలనున్న 2,290 మంది అభ్యర్థుల భవితవ్యం
నవంబర్ 30న తెలంగాణ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. ఒకే విడతలో 119 నియోజకవర్గాలకు పోలింగ్ పూర్తి అయ్యింది. తెలంగాణ వ్యాప్తంగా 71.34 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. తెలంగాణలో అత్యధికంగా మునుగోడులో 91.89 శాతం పోలింగ్ నమోదు అవగా.. అత్యల్పంగా యాకుత్‌పురలో 39.64 శాతం పోలింగ్ నమోదు అయ్యింది.
ఈరోజు 2,290 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. మొత్తం 119 నియోజకవర్గాల్లోనూ బీఆర్‌ఎస్ అభ్యర్థులు బరిలో నిలవగా.. 118 నియోజకవర్గాల్లో కాంగ్రెస్, ఒక స్థానంలో సీపీఐ, 111 నియోజకవర్గాల్లో బీజేపీ, 8 స్థానాల్లో జనసేన, 108 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఎస్పీ అభ్యర్థులు, 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సీపీఎం అభ్యర్థులు, 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంఐఎం అభ్యర్థులు పోటీ చేశారు.
అత్యథికంగా జూబ్లీహిల్స్‌లో 26 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగనుండగా.. అత్యల్పంగా భద్రాచలంలో 13 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఎల్బీనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో కౌంటింగ్ కోసం 28 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేశారు.
మేడ్చల్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో 28 చొప్పున టేబుళ్లు..
మహేశ్వరం, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో 28 చొప్పున టేబుళ్లు..
మల్కాజిగిరి, కూకట్‌పల్లి నియోజకవర్గాల్లో 20 చొప్పున..
ఉప్పల్ నియోజకవర్గంలో 20 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేశారు.
నారాయణఖేడ్, ఆందోల్, జహీరాబాద్ స్థానాల్లో 18 టేబుళ్లు,
పటాన్‌చెరు, హుజూర్‌నగర్, తుగంతుర్తి స్థానాల్లో 18 టేబుళ్లు
కరీంనగర్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో 16 చొప్పున టేబుళ్లు ఏర్పాటు
కోదాడ, ఖమ్మం నియోజకవర్గాల్లో 16 చొప్పున టేబుళ్లు ఏర్పాటు
షాద్‌నగర్ నియోజకవర్గంలో 12 చొప్పున టేబుళ్లు ఏర్పాటు