Ugadi Celebrations Oman: ఒమాన్ తెలంగాణ సమితి అధ్వర్యంలో వైభవంగా ఉగాది వేడుకలు
ABN , Publish Date - Apr 05 , 2025 | 05:10 PM
ఒమాన్ తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో మస్కట్‌లో ఉదాది వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: ప్రతి సంవత్సరం తరహాలోనే ఈసారి కూడా ఒమాన్ లో తెలుగు నూతన సంవత్సరం శ్రీ విశ్వావసు నామ వేడుకలు ఆధ్యాత్మికత వాతావారణంలో శోభాయమానంగా జరిగాయి.
ఒమాన్ తెలంగాణ సమితి అధ్వర్యంలో మస్కట్ నగరంలో శుక్రవారం జరిగిన కార్యక్రమాన్ని ఇండియన్ సోషల్ క్లబ్ చైర్మన్ పి. బాబు రాజేంద్రన్, ప్రధాన కార్యదర్శి షకీల్ కొమ్మత్ లాంఛనంగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి సంప్రదాయ వస్త్రధారణతో వందలాదిగా హాజరైన జనంతో ఈ వేడుకలో తెలుగుదనం వెల్లివిరిసింది.
ఒమాన్ తెలంగాణ సమితి కన్వీనర్ గుండేటి గణేశ్, కో కన్వీనర్ నూనె లక్ష్మణ్‌ల నేతృత్వంలో వైవిధ్యభరిత సాంస్కృతిక కార్యక్రమాలతో ఉగాది సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. మస్కట్‌లోని ప్రముఖ వేద పండితులు, సిద్ధాంతి విజయ పంచాంగ శ్రవణం చేసి వినిపించారు.
వేడుక నిర్వహణలో బుక శ్రీనివాస్, రమేశ్ తమ్మిశెట్టి, అమరేందర్ మేడిశెట్టి, రవి సుంకరి, కుమార్ మంచూకట్ల, అహ్మద్ శేఖ్, రాజేందర్ రెడ్డి, రాధ బాచ్చు, మాధవి రాజిరెడ్డి, రాధిక, రవి నూనె, శంకర్ బ్రహ్మమ్మదండి, రవి సాదుల, ప్రతాప్ రెడ్డి, చంద్రమోహన్, గంగాధర్ రామోజీ తదితరులు కీలక పాత్ర వహించారు.
కులమత, ప్రాంతీయ వివక్షకు తావు లేకుండా తెలుగు వారందర్నీ కలుపుకొంటూ అందరి సమన్వయంతో ఒమాన్ తెలంగాణ సమితి పని చేస్తుందని గుండేటి గణేష్, లక్ష్మణ్‌లు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
బహ్రెయిన్‌లో ఘనంగా 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఒమాన్‌లో మెగాస్టార్ అభిమానుల రక్తదాన శిబిరం
ఒంటారియో తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
మరిన్ని ఎన్నారై వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి