Amit Shah: ఆయుధాలు వీడండి.. మావోయిస్టులకు అమిత్‌షా పిలుపు
ABN , Publish Date - Apr 05 , 2025 | 05:15 PM
ఐదు దశాబ్దాలుగా బస్తర్ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాబోయే ఐదేళ్లలో బస్తర్‌ను అభివృద్ధి చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నారని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చెప్పారు.

దంతేవాడ: అభివృద్ధిని బుల్లెట్లు, బాంబులతో ఆపలేరని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) అన్నారు. మార్చి 2026 కల్లా నక్సల్ సమస్య అంతం కావాలని కేంద్రం దృఢ సంకల్పంతో ఉందని తెలిపారు. మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. లొంగిపోయిన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పూర్తి రక్షణ ఉంటుందని భరోసా ఇచ్చారు. ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న బస్తర్ పణ్‌డూమ్ వేడుకల్లో అమిత్‌షా శనివారంనాడు పాల్గొన్నారు.
PM Modi: మోదీకి శ్రీలంక 'మిత్ర విభూషణ' పురస్కారం
"బస్తర్‌లో హింసాకాండ శకం ముగిసింది. ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని మావోయిస్టు సోదరులను కోరుతున్నాను. మావోయిస్టులు చనిపోతో సంతోషించే వారెవరూ లేరు. వారు కూడా మాలో భాగమే. కానీ బుల్లెట్లు, బాంబులతో అభివృద్ధిని ఆపలేరు'' అని అమిత్‌షా అన్నారు. లొంగిపోయిన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రక్షణ ఉంటుందన్నారు. ఐదు దశాబ్దాలుగా బస్తర్ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాబోయే ఐదేళ్లలో బస్తర్‌ను అభివృద్ధి చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పారు. స్థానికులు విద్య, వైద్య సదుపాయాలతో పాటు ఆధార్, రేషన్ కార్డులు, ఆరోగ్య బీమా పొందినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. నక్సల్ సమస్య తొలగితేనే బస్తర్ అభివృద్ధి చెందుతుందని, మావోయిస్టు రహిత గ్రామాల్లో రూ. కోటి విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు చేపడతామని అన్నారు. గత ఏడాది 881 మంది నక్సలైట్లు లొంగిపోగా, ఈ ఏడాది ఇంతవరకూ 521 మంది నక్సల్స్ లొంగిపోయినట్టు అమిత్‌షా చెప్పారు.
జాతీయ స్థాయిలో బస్తర్ పణ్‌డూమ్
బస్తర్ పణ్‌డూమ్ వేడుకలను వచ్చే ఏడాది జాతీయ స్థాయిలో నిర్వహిస్తామని అమిత్‌షా ప్రకటించారు. ఆ పండుగకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును తాను ఆహ్వానిస్తామని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
Cash Row: అలహాబాద్ హైకోర్టు జడ్జిగా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ వర్మ
Chennai: రేపు ప్రధాని మోదీతో ఈపీఎస్, ఓపీఎస్ భేటీ
Earthquake: పలు దేశాల్లో కంపిస్తోన్న భూమాత.. క్షణ క్షణం.. భయం భయం
For National News And Telugu News