Share News

TS Election: ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం

ABN , First Publish Date - 2023-12-02T19:52:16+05:30 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ( Telangana Assembly Elections ) కు సంబంధించి రేపు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ( Votes Counting ) ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసింది.

TS Election: ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ( Telangana Assembly Elections ) కు సంబంధించి రేపు (ఆదివారం) ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ( Votes
Counting ) ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసింది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఉంటుంది. లక్షా 80 వేల పోస్టల్ ఓట్లు పోలయ్యాయి. ప్రతి 20నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం వచ్చే అవకాశం ఉంది. వేగంగా ఫలితాలు ఇచ్చేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందించారు.ఒక్కొక్క నియోజకవర్గానికి 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో లెక్కింపు ప్రక్రియ ఉంటుంది.తెలంగాణలో మొత్తం 3,26,02,793 ఓట్లు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో 2,32,59,256 ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణలో 79 నియోజకవర్గాల్లో 75% ఓటింగ్ జరిగింది. రాష్ట్రంలో కౌంటింగ్‌‌కు మొత్తం 1766 టేబుల్స్ ఏర్పాటు చేశారు.119 నియోజకవర్గాలకు 49 టేబుల్స్ ఏర్పాటు చేశారు.

మరిన్ని తెలంగాణ ఎన్నికల వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - 2023-12-02T20:01:54+05:30 IST