DGP Anjani Kumar: ఈ ఎన్నికల్లో భారీగా నగదు సీజ్ చేశాం
ABN , First Publish Date - 2023-12-02T20:00:51+05:30 IST
తెలంగాణ -2023 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 469.63 కోట్ల విలువైన నగదు, బంగారం, వెండి, మద్యం, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని తెలంగాణ రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ ( DGP Anjani Kumar ) వెల్లడించారు. శనివారం నాడు డీజీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ ఎన్నికల్లో ఎన్నికల సంఘం మార్గదర్శకత్వంలో పోలీస్ సిబ్బంది పనిచేశారని అన్నారు. ఈ ఎన్నికల్లో భారీగా నగదు సీజింగ్ చేశామని డీజీపీ అంజనీ కుమార్ చెప్పారు.
హైదరాబాద్: తెలంగాణ -2023 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 469.63 కోట్ల విలువైన నగదు, బంగారం, వెండి, మద్యం, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని తెలంగాణ రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ ( DGP Anjani Kumar ) వెల్లడించారు. శనివారం నాడు డీజీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ ఎన్నికల్లో ఎన్నికల సంఘం మార్గదర్శకత్వంలో పోలీస్ సిబ్బంది పనిచేశారని అన్నారు. ఈ ఎన్నికల్లో భారీగా నగదు సీజింగ్ చేశామని చెప్పారు. అక్టోబర్9 వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ ఉదయం 6 గంటల వరకు 11,859 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని చెప్పారు.
ఇక 2018 ఎన్నికల్లో రూ. 103 కోట్ల విలువైన నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. అత్యుత్తన్నత అంకితభావంతో కూడిన అధికారుల సమూహంలో సభ్యుడిగా ఉన్నందుకు గర్విస్తున్నానని చెప్పారు. సీనియర్లు, యంగ్ స్టార్స్ ఇద్దరూ తమ సామర్థ్యానికి మించి పనిచేశారని కొనియాడారు. ఇలాంటి మెగా ఈవెంట్ మన జ్ఞాపకాలలో చిరకాలం నిలిచిపోతుందని చెప్పారు. ఈ ఎన్నికల్లో పనిచేసిన సహోద్యోగులకు డీజీపీ అంజనీ కుమార్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
మరిన్ని తెలంగాణ ఎన్నికల వార్తల కోసం క్లిక్ చేయండి