Cleanest Beaches: భారతదేశంలో సురక్షితమైన, శుభ్రమైన టాప్ 5 బీచ్‌లు..
ABN , Publish Date - Apr 04 , 2025 | 07:22 PM
Safe Beaches for Families in India: ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో పిల్లలతో కలిసి ఫ్యామిలీ ట్రిప్ వెళ్లాలనుకునేవారికి కలుషితం కాని స్వచ్ఛమైన బీచ్‌లు గుర్తించడం సవాలే. కానీ, ఉన్న ఈ 5 బీచ్‌లు భారతదేశంలోనే అత్యంత స్వచ్ఛమైనవి. ఆహ్లాదకరమైనవి.

Clean and Safe Beaches for Kids in India: పిల్లలతో కలిసి ఏదైనా బీచ్‌కు వెళ్లి సరదాగా గడపాలని ప్లాన్ చేస్తున్నారా? కలుషితం కాని స్వచ్ఛమైన వాతావరణంతో ఫ్యామిలీతో కలిసి సరదాగా గడపాలని కోరుకుంటున్నట్లయితే.. భారతదేశంలో ఉండే ఈ 5 బీచ్‌లు అద్భుతమైన ఎంపికలు. ఇక్కడి సముద్రతీరాల్లోని మృదువైన ఇసుక, నెమ్మదిగా, సున్నితంగా తీరాన్ని తాకే అలలు విహారయాత్రకు అనువైనవి. కాబట్టి, కుటుంబంతో కలిసి ఈ సముద్ర తీరాల్లో ఏ ఆందోళన లేకుండా సరదాగా గడిపేయండి.
1. రాధానగర్ బీచ్
అండమాన్ నికోబార్ దీవుల్లోని రాధానగర్ బీచ్ ఆసియాలోని అత్యుత్తమ బీచ్‌లలో మొదటిదానిగా గుర్తించబడింది. ఈ బీచ్‌లోని నీరు స్ఫటికంలా స్పష్టంగా ఉంటుంది. తెల్లటి ఇసుకతిన్నెలు, స్వచ్ఛమైన అలలు, ఆహ్లాదకరమైన వాతావరణం పిల్లలకు సురక్షితమైనది. ఆడుకోవడానికి అనువైనది. మరిచిపోలేని యాత్రా అనుభవాలను అందిస్తుంది.
2. పలోలెం బీచ్
గోవాలో ఎన్నో అందమైన బీచ్‌లు ఉన్నా పల్లోలం బీచ్ మరింత ప్రత్యేకం. నీలం రంగులో మెరిసిపోయే నీటిలో ఎగిరే డాల్ఫిన్లు కనులకు విందు చేస్తాయి. ఫ్యామిలీ, స్నేహితులతో కలిసి ఇక్కడి కేఫ్‌లలో సరదాగా గడపవచ్చు.
3. కోవలం బీచ్
కేరళలోని కోవలం బీచ్ తీరంలో నీరు తక్కువ లోతు ఉంటుంది. ప్రశాంతంగా, నెమ్మదిగా దూకే అలలు ఉండటం వల్ల పిల్లలు ఆడుకునేందుకు సురక్షితం. కుటుంబ విహారయాత్రలకు గొప్ప ఎంపిక. ఇక్కడి తీరాల్లో ఇసుక కోటలు కట్టి ఎంజాయ్ చేస్తారు పర్యాటకులు.
4. మెరీనా బీచ్
చెన్నైలోని మెరీనా బీచ్ అతి పొడవైన బీచ్‌లలో ఒకటి. ఇక్కడ వారాంతాల్లో జనాల తాకిడి మరీ అధికంగా ఉంటుంది. పిల్లలు, పెద్దలు అంతా కలిసి గుర్రపు స్వారీ, గాలిపటం ఎగురవేయడం లాంటివి చేస్తూ సరదాసరదాగా గడుపుతారు.
5. తార్కర్లీ బీచ్
మహారాష్ట్రలోని తార్కర్లీ బీచ్ నీళ్లు స్వచ్ఛంగా మెరిసిపోతుంటాయి. ఇక్కడి మృదువైన తెల్లని ఇసుకలో ఆడుకోవడం గొప్ప మధురానుభూతిని కలిగిస్తుంది. ఇక్కడ స్నార్కెలింగ్, అనేక రకాల వాటర్ గేమ్స్ అందుబాటులో ఉన్నాయి. కుటుంబంతో కలిసి ట్రిప్ వెళ్లేందుకు ఈ బీచ్ ఎంతో అనుకూలమైనది.
Read Also: Travel Destinations: వేసవిలో కొత్త జంటలు చూడదగ్గ.. టాప్ 5 బడ్జెట్ ఫ్రెండ్లీ హనీమూన్ స్పాట్స్..
Chanakya Neeti: ఇలాంటి వాళ్లను నమ్మి ఇంటికి పిలిచారో అంతే..
Summer Tips: స్టైలిష్ లుక్ కోసం వేసవిలోనూ బూట్లు ధరిస్తున్నారా.. ఇలా చేస్తే