Share News

బద్రీనాథ్ యాత్రికులకు గుడ్ న్యూస్.. ఇకపై ప్రకృతి అందాల మధ్యలో రైలు ప్రయాణం..

ABN , Publish Date - Apr 04 , 2025 | 07:07 PM

Rishikesh to Karnaprayag rail line: రుషికేష్ నుంచి కర్ణప్రయాగ్ వరకు 125 కిలోమీటర్ల పొడవుతో రైలు మార్గం ఉంటుంది. ఈ రైలు మార్గం ఎక్కువగా టన్నెళ్ల రూపంలో ఉంటుంది. కేదార్‌నాథ్, బద్రీనాథ్ వెళ్లే భక్తులు ఈ టన్నెళ్లలో ప్రయాణిస్తూ థ్రిల్ పొందొచ్చు.

బద్రీనాథ్ యాత్రికులకు గుడ్ న్యూస్.. ఇకపై ప్రకృతి అందాల మధ్యలో రైలు ప్రయాణం..
Rishikesh to Karnaprayag

డెహ్రడూన్: ఉత్తరాఖండ్ అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎత్తైన కొండలు, ఆకుపచ్చని పచ్చిక బయళ్లు .. ఆహా అక్కడ విహరిస్తే స్వర్గంలోొ విహరించినట్లే ఉంటుంది. ఇకపై కేదార్‌నాథ్, బద్రీనాథ్ వెళ్లే భక్తులు.. రైలులో ప్రయాణిస్తూ ఈ పకృతి అందాలను ఎంజాయ్ చేయవచ్చు. ఈ మేరకు రుషికేష్ నుంచి కర్ణప్రయాగ్ వరకు నిర్మిస్తున్న రైలు టన్నెళ్ల పనులు 90 శాతం పూర్తయ్యాయి. మొత్తం 125 కిలోమీటర్ల మేర రైలు మార్గం ఉంటుంది. ఈ మార్గంలో 88 కిలోమీటర్ల మేర ఉండే 8 రెస్క్యూ టన్నెళ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. ఈ విషయాన్ని స్వయంగా యూనియన్ ఇన్ఫర్మేషన్, అండ్ బ్రాడ్ కాస్టింగ్ మినిష్టర్ అశ్వినీ వైష్ణవ్ రాజ్యసభలో చెప్పుకొచ్చారు.


ఇంతకీ సంగతేంటంటే..

ఉత్తరాఖండ్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేవి కొండలు. కొండల మధ్య రైలు మార్గం వెయ్యాలంటే మామూలు విషయం కాదు కదా.. కేంద్ర ప్రభుత్వం రుషికేష్ నుంచి కర్ణప్రయాగ్ వరకు మొత్తం 125 కిలోమీటర్ల పొడవుతో రైలు మార్గం వేస్తోంది. ఈ రైలు మార్గానికి కొండలు అడ్డుగా ఉండటంతో వాటికి రంధ్రాలు చేసి, టన్నెళ్ల ద్వారా మార్గాన్ని ముందుకు తీసుకెళుతోంది. రుషికేష్ నుంచి కర్ణప్రయాగ్ వరకు వెళ్లే మార్గంలో ఎక్కువగా టన్నెళ్లే ఉంటాయి. కేదార్‌నాథ్, బధ్రీనాథ్ వెళ్లే భక్తులు రుషికేష్ నుంచి కర్ణప్రయాగ్ వరకు రైలులో ప్రయాణిస్తూ ఓ వైపు పకృతి అందాలను చూస్తూనే.. మరో వైపు టన్నళ్లలో థ్రిల్‌కు గురిచేసే అనుభూతిని పొందొచ్చు. అంతేకాదు.. ఈ రైలు గంగోత్రి, యమునోత్రి మీదుగా కూడా వెళుతుంది.


సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు షాక్..

కేదార్‌నాథ్, బధ్రీనాథ్ ఆలయ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు షాక్ ఇచ్చింది. ఆలయ ప్రాంగణంలోకి వచ్చి.. వీడియోలు తీసే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ణప్తి చేసింది. అంతేకాదు.. ఎవరైనా ఆలయ ప్రాంగణంలో వీడియో తీస్తూ కనిపిస్తే.. దర్శనం లేకుండానే వారిని తిరిగి పంపించనున్నారు. కుంభమేళలో చోటుచేసుకున్న మోనాలిసా సంఘటనతో ఆలయ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.

Updated Date - Apr 04 , 2025 | 08:04 PM