Rajasingh: CEO వికాస్‌రాజ్‌ను కలిసిన రాజాసింగ్
ABN , First Publish Date - 2023-11-15T18:43:44+05:30 IST
CEO వికాస్‌రాజ్‌ను బీజేపీ గోషామహల్ అభ్యర్థి రాజాసింగ్ ( Rajasingh ) కలిశారు.
హైదరాబాద్: CEO వికాస్‌రాజ్‌ను బీజేపీ గోషామహల్ అభ్యర్థి రాజాసింగ్ ( Rajasingh ) కలిశారు. ఈ మేరకు గోషామహల్ నియోజకవర్గంలో పలు బూత్‌లలో గతంలో రెగ్గింగ్ జరిగినట్లు ఈసారి అలా జగరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాజాసింగ్ CEO వికాస్‌రాజ్‌కి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా రాజాసింగ్ EC కార్యాలయం దగ్గర మీడియాతో మాట్లాడుతూ..‘‘గోషామహల్ నియోజకవర్గంలో లాస్ట్ టైం రెగ్గింగ్ జరిగింది. ఈసారి రెగ్గింగ్ జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరాం. ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద సీసీటీవీ, పోలీస్, సెంట్రల్ ఫోర్సెస్ ఉంచాలని కోరాం. కొంతమంది పోలీస్ అధికారులు బీజేపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారు. పోలింగ్ టైంలో బూత్ లోకి ఎవరు వచ్చినా ID కార్డ్ చూపించేలా చర్యలు తీసుకోవాలి. MIM, BRS గుండాలు గోషామహల్‌లో దాదాగిరి చేస్తున్నారు’’ అని రాజాసింగ్ అన్నారు.