Share News

Thummala Nageswara Rao: ఖమ్మంలో అరాచకంపై బటన్ నొక్కి తీర్పు ఇవ్వాలి

ABN , First Publish Date - 2023-11-22T10:09:46+05:30 IST

ఖమ్మంలో అరాచకంపై బటన్ నొక్కి తీర్పు ఇవ్వాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నేడు తుమ్మలకు మద్దతుగా కురవి మండలం బలపాల గ్రామస్తులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ బలపాల గ్రామస్థులు అండగా ఉన్నారన్నారు.

Thummala Nageswara Rao: ఖమ్మంలో అరాచకంపై బటన్ నొక్కి తీర్పు ఇవ్వాలి

ఖమ్మం : ఖమ్మంలో అరాచకంపై బటన్ నొక్కి తీర్పు ఇవ్వాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నేడు తుమ్మలకు మద్దతుగా కురవి మండలం బలపాల గ్రామస్తులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ బలపాల గ్రామస్థులు అండగా ఉన్నారన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ తనకూ.. రేణుకా చౌదరికి రాజకీయ జన్మ ఇచ్చారన్నారు.

ఎన్టీఆర్ తనను మొదటి సారే వెంగల రావు కుటుంబంపై నిలబెట్టారన్నారు. నలబై ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానంటే ప్రజాభిమానం కారణంగానేనని తుమ్మల పేర్కొన్నారు. వామపక్ష యోధులు ఉన్న జిల్లాలో గౌరవంగా రాజకీయాలు చేశానన్నారు. తన రాజకీయ లక్ష్యం గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాని సస్య శ్యామలం చేయడమేనన్నారు. అరాచక శక్తులు రాజ్యమేలుతుంటే అలాగే ఉండాలా? అని ప్రశ్నించారు. ఖమ్మం ఎన్నికపై కోట్లలో బెట్టింగ్‌లు సాగుతున్నాయని తుమ్మల పేర్కొన్నారు.

Updated Date - 2023-11-22T10:09:47+05:30 IST