Share News

Revanth Reddy: టీఏస్‌పీఏస్సీపై నేడు మరోసారి సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

ABN , First Publish Date - 2023-12-12T07:58:24+05:30 IST

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీఏస్‌పీఏస్సీపై మంగళవారం మరోసారి సమీక్ష చేయనున్నారు. టీఏస్‌పీఏస్సీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Revanth Reddy: టీఏస్‌పీఏస్సీపై నేడు మరోసారి సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) టీఏస్‌పీఏస్సీ (TSPSC)పై మంగళవారం మరోసారి సమీక్ష చేయనున్నారు. టీఏస్‌పీఏస్సీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే టీఏస్‌పీఏస్సీ బోర్డు ఛైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా చేశారు. మిగతా బోర్డు సభ్యులు కూడా ఈరోజు రాజీనామా చేసే అవకాశం ఉంది. బోర్డు పూర్తి స్థాయి ప్రక్షాళన తర్వాతే నోటిఫికేషన్‌లు ఇవ్వనున్నారు.

ఉద్యోగ నియామకాలపై సీఎం రేవంత్‌రెడ్డి దూకుడు పెంచారు. కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్‌కు అనుగుణంగా టీఎస్పీఎస్సీ అడుగులు వేయనున్నది. ఇప్పటికే కోదండరామ్‌ (Kodandaram)తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. టీఎస్పీఎస్సీ పరీక్షలన్నీ రీషెడ్యూల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ ప్రకారం రిక్రూట్‌మెంట్‌ చేయనుంది. త్వరలో కొత్త పరీక్ష తేదీలు ప్రకటించే అవకాశం ఉంది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లను మళ్లీ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.

Updated Date - 2023-12-12T07:58:26+05:30 IST