Share News

BJP MP Raghunandan Rao:మరో 20 ఏళ్లు కాంగ్రెస్ కష్టమే.. రేవంత్‌రెడ్డికి రఘునందన్ రావు మాస్ వార్నింగ్

ABN , Publish Date - Apr 09 , 2025 | 05:50 PM

BJP MP Raghunandan Rao: సీఎం రేవంత్‌రెడ్డిపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీతో పెట్టుకోమాకని హెచ్చరించారు. బీజేపీతో పెట్టుకుంటే కాంగ్రెస్‌కు వచ్చే 20 ఏళ్లు తెలంగాణలో స్థానం లేదని ఎంపీ రఘునందన్ రావు చెప్పారు.

BJP MP Raghunandan Rao:మరో 20 ఏళ్లు కాంగ్రెస్ కష్టమే.. రేవంత్‌రెడ్డికి రఘునందన్ రావు మాస్ వార్నింగ్
BJP MP Raghunandan Rao

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి లాస్ట్ ముఖ్యమంత్రి అని చెప్పారు. వచ్చే 20 ఏళ్లు కాంగ్రెస్‌కు తెలంగాణలో స్థానం లేదని అన్నారు. ఇవాళ(బుధవారం) హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో రఘునందన్ రావు మీడియాతో చిట్‌చాట్ చేశారు. రేవంత్ ఎంపీగా చేసిన మల్కాజ్‌గిరిని తామే దక్కించుకున్నామని అన్నారు. రేవంత్ సొంత నియోజకవర్గంలో మహబూబ్‌నగర్ ఎంపీ బీజేపీ గెలిచిందని గుర్తుచేశారు. రేవంత్ ఇన్‌చార్జిగా ఉన్న చేవెళ్ల బీజేపీ దక్కించుకుందని చెప్పారు. ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడగొట్టింది కూడా బీజేపీనేనని.. ఈ విషయాన్ని మర్చిపోవద్దని అన్నారు. తెలంగాణలో బీజేపీనీ రేవంత్ రెడ్డి అడుగు పెట్టనిచ్చేది ఏందని రఘునందన్ రావు సెటైర్లు గుప్పించారు.


రాష్ట్రంలో పాలన ఉందా: ఎంపీ డీకే అరుణ

D-K-ARuna.jpg

కేసీఆర్ నియంతృత్వమే రేవంత్ ప్రభుత్వానికి కూడా వచ్చిందని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. అమరచింత ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవానికి చంద్రఘడ్‌కు చెందిన మహిళ వస్తే సగం డెలివరీ చేసి పంపడం ఘోరమని అన్నారు. అసలు ప్రభుత్వం అజామాయిషీ ఆస్పత్రులపై ఉందా.. రాష్ట్రంలో పాలన ఉందా అని ప్రశ్నించారు. ఇవాళ మహబూబ్‌నగర్‌లో ఎంపీ డీకే అరుణ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి చలనం లేదని మండిపడ్డారు. పత్రికల్లో పెద్దపెద్దగా హామీలపై గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ అమలు చేయడం లేదని అన్నారు. అమరచింతలో జరిగిన సంఘటనకు సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలకు ఎలాంటి చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. అలాగే బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. హైదరాబాద్ నగరంలో 12 యూనివర్సిటీల్లో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సంబంధించిన జీవో 12ను వెంటనే వెనక్కు తీసుకోవాలని నిరసనకు వెళ్తే 900 మందిని అన్యాయంగా అరెస్ట్ చేసి 13 పోలీసు స్టేషన్‌లలో ఉంచారని చెప్పారు. వారికి అడిగే హక్కు లేదా.. ఈ ప్రభుత్వానిది నిరంకుశ పాలన కాదా అని ప్రశ్నించారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్ కేసు.. ప్రధాన నిందితుడి పాస్‌పోర్ట్ రద్దు

Manchu Manoj: నా జుట్టు విష్ణు చేతికి వెళ్ళాలన్నది అతని లక్ష్యం..

Mohan Babu Family Dispute: మోహన్‌బాబు ఇంటి వద్ద మరోసారి ఉద్రిక్తత

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 09 , 2025 | 07:23 PM