Share News

Praja Bhavan: ప్రజా వాణి.. దరఖాస్తులు స్వీకరించనున్న మంత్రి సీతక్క

ABN , Publish Date - Dec 26 , 2023 | 10:54 AM

హైదరాబాద్: ప్రజా భవన్‌లో ప్రజావాణి కార్యక్రమం మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొననున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ కార్యక్రమం జరగనుంది. తమ సమస్యలను చెప్పుకునేందుకు ఉదయం 6 గంటల నుంచే జనాలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు.

Praja Bhavan: ప్రజా వాణి.. దరఖాస్తులు స్వీకరించనున్న మంత్రి సీతక్క

హైదరాబాద్: ప్రజా భవన్‌లో ప్రజావాణి కార్యక్రమం మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొననున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ కార్యక్రమం జరగనుంది. తమ సమస్యలను చెప్పుకునేందుకు ఉదయం 6 గంటల నుంచే జనాలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ధరణి సమస్యలు, పెన్షన్, డబుల్ బెడ్‌రూమ్ సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రతి మంగళ, శుక్రవారం ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. ప్రజా సమస్యలపై ధరఖాస్తులు స్వీకరించేందుకు తెలంగాణ సర్కార్ నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి భారీ స్పందన లభిస్తోంది. ప్రజా భవన్‌లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పింఛన్లు, ఇళ్లు, ఉద్యోగాలు ఇప్పించాలని పెద్ద ఎత్తున వచ్చిన జనాలు తమ సమస్యలపై అధికారులకు ఫిర్యాదులు అందజేస్తున్నారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - Dec 26 , 2023 | 10:54 AM