TSPSC: నేడు సిట్ ముందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి | Revanth is going to Sit Office anr

TSPSC: నేడు సిట్ ముందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

ABN , First Publish Date - 2023-03-23T11:15:38+05:30 IST

హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) గురువారం ఉదయం సిట్ కార్యాలయానికి (SIT Office) వెళ్లనున్నారు.

TSPSC: నేడు సిట్ ముందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) గురువారం ఉదయం సిట్ కార్యాలయానికి (SIT Office) వెళ్లనున్నారు. టీఎస్పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజ్ (Paper Leakage)కు సంబంధించి రేవంత్ చేసిన ఆరోపణలపై ఆధారాలు ఇవ్వాలంటూ సిట్ అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌‌ (Bandi Sanjay)కు కూడా నోటీసులు ఇచ్చారు. ఈ నెల 24న హాజరు కావాలన్నారు. 91 సీఆర్పీసి (CRPC) ప్రకారం నోటీసులు ఇచ్చారు.

కాగా టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్‌పై విమర్ళలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సోమవారం (20వ తేదీ) నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. పేపర్ లీక్ కేసులో ఆధారాలు ఇవ్వాలని సిట్ అధికారులు కోరారు. ఇటీవలే మంత్రి కేటీఆర్ (Minister KTR) పీఏ తిరుపతి (PA Tirupathi) పాత్ర ఉందని రేవంత్ వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన వివరాలు అందచేయాలంటూ రేవంత్ రెడ్డికి అధికారులు నోటీసులు జారీ చేశారు. ఓకే మండలంలో వందమందికి ర్యాంకులు వచ్చాయంటూ రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. దీంతో రేవంత్ వద్ద ఉన్న వివరాలతో సహా ఆధారాలు అందజేయాలని సిట్ ఏసీపీ ఈ మేరకు నోటీసులు జారీ చేశారు.

Updated Date - 2023-03-23T11:15:38+05:30 IST