Tejaswi Surya: రంగంలోకి తేజస్వీ సూర్య .. యూత్‌ను ఆకర్షించేలా బీజేపీ ప్లాన్
ABN , First Publish Date - 2023-10-04T19:12:18+05:30 IST
బీజేపీ(BJP) రాబోయే ఎన్నికలకు ఇప్పటినుంచే రంగంలోకి దిగింది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM MODI)ని తెలంగాణలోని మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాలో పర్యటించేలా చేశారు.
హైదరాబాద్: బీజేపీ(BJP) రాబోయే ఎన్నికలకు ఇప్పటినుంచే రంగంలోకి దిగింది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM MODI)ని తెలంగాణలోని మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాలో పర్యటించేలా చేశారు. ఈ పర్యటనలో మోదీ పలు హామీలను సైతం ఇచ్చారు. ఆ తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్(BRS, Congress) పార్టీలపై ప్రధానంగా విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్(CM KCR)పై కాస్తా ఘాటుగానే విమర్శలను సంధించారు. మోదీ పర్యటన అనంతరం.. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ పలు ప్లాన్‌లను రూపొందించింది. దీనిలో భాగంగా కేంద్రమంత్రులు, బీజేపీలో బాగా చరిష్మా ఉన్న నేతలను వాడుకోనేందుకు సిద్ధమైంది.
యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న BJYM నేషనల్ ప్రెసిడెంట్, బెంగుళూరు సౌత్ ఎంపీ తేజస్వీ సూర్య(Tejaswi Surya)ను రాష్ట్రంలో పర్యటించేలా ప్లాన్ చేస్తున్నారు. యూత్‌ను ఆకర్షించేలా ఈ పర్యటనను రూపొందించినట్లు తెలుస్తోంది. బీజేపీ ప్లాన్‌లో భాగంగా ఈనెల 12వ తేదీన తేజస్వీ సూర్య రాష్ట్రానికి రానున్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్లో తెలంగాణ రాష్ట్ర యువ మోర్చా(BJYM) నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో రాబోయే ఎన్నికలపై క్యాడర్‌కు తేజస్వీ సూర్య దిశానిర్ధేశం చేయనున్నారు.