Hyderabad: దుర్గం చెరువు వద్ద బయటపడ్డ మృతదేహాం

ABN , First Publish Date - 2023-05-08T16:20:13+05:30 IST

నగరంలోని మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యక్తి మృతదేహం పోలీసులు వెలికితీశారు.

Hyderabad: దుర్గం చెరువు వద్ద బయటపడ్డ మృతదేహాం

హైదరాబాద్: నగరంలోని మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యక్తి మృతదేహం పోలీసులు వెలికితీశారు. నల్గొండ జిల్లా సూర్యాపేటకు చెందిన వెంకట నరసింహారెడ్డి(31)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టు‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాల‌పై మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఒక్కసారిగా మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ కన్నీమున్నీరుగా రోదించారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన జరిగి మూడు రోజులు గడిచింది. అప్పటి నుంచి మృతదేహాం కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినప్పటికీ ఇవాళ మృతదేహాన్ని వెలికితీశారు. ఎందుకు ఆత్మహత్యకు పాల్పడాల్సి వచ్చింది? ఆర్థిక ఇబ్బందులా? లేక కుటుంబ కలహాల? అలాగే ఎవరైనా బెదిరింపులకు భయపడి ఆత్మహత్యకు పాల్పడ్డా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇంకా ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated Date - 2023-05-08T16:20:13+05:30 IST