KTR: వ్యవస్థలో లోపాలు ఎప్పటికీ ఉంటాయి..
ABN , First Publish Date - 2023-06-20T15:33:55+05:30 IST
రాజన్న సిరిసిల్ల జిల్లా: వ్యవస్థలో లోపాలు ఎప్పటికీ ఉంటాయని, అన్నింటినీ భూతద్దంలో చూడవద్దని బీఆర్ఎస్ (BRS) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా: వ్యవస్థలో లోపాలు ఎప్పటికీ ఉంటాయని, అన్నింటినీ భూతద్దంలో చూడవద్దని బీఆర్ఎస్ (BRS) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. మంగళవారం సిరిసిల్ల జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రజలు అగం కావద్దని, ఎవరో వచ్చి ఉపన్యాసాలు ఇవ్వగానే తొందర పడవద్దని అన్నారు.
తాము ఖర్చు పెట్టే డబ్బులు ప్రజలవేనని, తమ పైసలు కాదని, అందుకే జాగ్రత్తగా ఖర్చు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. తాను కారులో వస్తుంటే ఇద్దరు ముగ్గురు పొరగల్లు వచ్చి అడ్డం వస్తారు ఏమీ అవుతుందన్నారు... ఇక్కడ ఎంపీ అర పైసా అయినా ఖర్చు చేశారా? అని ప్రశ్నించారు. ఎంపీకి చేతనైతే మేము ఒక్క బడి కడితే మీరు రెండు కట్టమనండని సూచించారు. తాను పోలీసులను అడ్డం పెట్టుకోనని, ప్రజల మధ్యలో ఉండే వాడిని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.