Ponguleti Srinivasreddy: ఆ వెయ్యి కోట్ల హామీ ఏమైంది కేసీఆర్?

ABN , First Publish Date - 2023-08-01T16:09:45+05:30 IST

భద్రాచలం లో గత వరదల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన వెయ్యి కోట్ల హామీ ఏమైందని కాంగ్రెస్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రశ్నించారు.

Ponguleti Srinivasreddy: ఆ వెయ్యి కోట్ల హామీ ఏమైంది కేసీఆర్?

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం లో గత వరదల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన వెయ్యి కోట్ల హామీ ఏమైందని కాంగ్రెస్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. గోదావరి పరివాహక ప్రాంతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న స్థితే తెలంగాణాలో ఉందన్నారు. ముఖ్యమంత్రికి హామీలు తప్ప అమలు చేయటం రాదని విమర్శించారు. నిధుల ప్రకటన, మాట ఇవ్వటం మరచిపోవడం కల్వకుంట్ల కుంటుంబానికి అలవాటని సెటైర్ విసిరారు. ఎన్నికల దృష్టితో ఆర్టీసీపై ప్రకటన, గతంలో ఉద్యమించిన ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ వేధించిన తీరు కార్మికులు మరిచిపోలేరని.. ఆర్టీసీ విలీనాన్ని కాంగ్రెస్ కోరుకుంటోందన్నారు. తెలంగాణలో వరదలతో జనం తల్లడిల్లిపోతుంటే పక్క రాష్ట్రం మహారాష్ట్ర వెళ్లి అక్రమ సొమ్ముతో ఫిరాయింపుల ప్రోత్సాహం.. ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవుపలికారు. వరద బాధితులకు కాంగ్రెస్ కార్యకర్తలు అండగా నిలుస్తారని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-08-01T16:15:45+05:30 IST