విద్యుత్ ఆర్టిజన్ కార్మికులకు పీఆర్‌సీ చెల్లించాలి
ABN , First Publish Date - 2023-01-17T23:25:17+05:30 IST
టీఎస్ యునైటెడ్ ఎలక్ర్టిసిటీ ఎంప్లాయీస్ యూనియన్, సీఐటీయూ నాయకుల డిమాండ్

సంగారెడ్డి రూరల్, జనవరి 17: విద్యుత్ ఆర్టిజన్ కార్మికులకు పీఆర్‌సీ చెల్లించాలని తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ర్టిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ప్రసాద్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని ట్రాన్స్‌కో ఎస్‌ఈ కార్యాలయం ఎదుట మంగళవారం కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్టిజన్ కార్మికులు ప్రభుత్వానికి ఎంత సేవ చేసినా పట్టించుకోవడం లేదన్నారు. 2022 ఏప్రిల్ నుంచి రావల్సిన పీఆర్‌సిని వెంటనే విడుదల చేయాలని, జీవో 11 ప్రకారం వేతనాలు చెల్లించాలని కోరారు. లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఎసీఈకి వినతిపత్రాన్ని అందజేశారు. ధర్నాలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు వంశీ, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లేశం, ఉపాధ్యక్షుడు రాములు నాయక్, శ్రీనివా్‌సచారి, హనుమంతు, సురేష్, రమేష్, పద్వారావు పాల్గొన్నారు.