బీఆర్‌ఎస్ చేతల పార్టీ ...
ABN , First Publish Date - 2023-01-24T23:58:36+05:30 IST
ప్రజాఅవసరాలకు అనుగుణంగా అభివృద్ది పనులు చేసుకుంటూ ముందుకు సాగుతున్న పార్టీ బీఆర్‌ఎస్ అని..... కేవలం మాటలు చెబుతూ కాలం గడుపుతున్న పార్టీ బీజేపీ అని మంత్రి మల్లారెడ్డి ఎద్దేవ చేశారు.

బీజేపీ మాటల పార్టీ : మంత్రి మల్లారెడ్డి
మేడ్చల్ జనవరి 24(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : ప్రజాఅవసరాలకు అనుగుణంగా అభివృద్ది పనులు చేసుకుంటూ ముందుకు సాగుతున్న పార్టీ బీఆర్‌ఎస్ అని..... కేవలం మాటలు చెబుతూ కాలం గడుపుతున్న పార్టీ బీజేపీ అని మంత్రి మల్లారెడ్డి ఎద్దేవ చేశారు. మంగళవారం మేడ్చల్ మండలంలోని రాజబొల్లారం, అక్బర్జాపేట గ్రామాల్లో రూ.50లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్డు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ మాటలతో పబ్బం గడుపుతున్న బీజేపీకి నేడు రాష్ట్రంలో దిక్కుతోచని పరిస్థితి నెలకొందన్నారు. జాతీయ పార్టీగా బీఆర్‌ఎస్ ఎదుగుదలను ఎవ్వరూ ఆపలేరన్నారు. అన్నివర్గాల ప్రజల కోసం ముఖ్యమంత్రి కేిసీఆర్ ప్రవేశ పెడుతున్న పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఆర్ధికంగా ఎదగటానికి సీఎం అనేక సంక్షేమ పథకాలను అమలు పరిచారని, ప్రస్తుతం కంటి వెలుగు కార్యక్రమంతో అంధత్వ నిరవారణ ఉద్యమం చేపట్టారన్నారు. కార్యక్రమంలో జడ్పీచైర్మన్ శరత్‌చంద్రారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యదవ్, రైతు సమితి జిల్లా అధ్యక్షుడు నందారెడ్డి, ఎంపీపీ రజిత రాజమల్లారెడ్డి, మండలపరిషత్ ఉపాధ్యక్షుడు వెంకటేశ్, జడ్పీటీసీ శైలజావిజయేందర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు దయానంద్‌యాదవ్, జహంగీర్, శ్రీనివా్‌సరెడ్డి, రాజమల్లారెడ్డి, సర్పంచ్, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.