విలువల వైతాళికుడు జైపాల్‌రెడ్డి

ABN , First Publish Date - 2023-01-16T23:05:25+05:30 IST

కేంద్ర మాజీ మంత్రి, ఉత్తమ పార్లమెంటేరియన్‌ గ్రహీత సూదిని జైపాల్‌రెడ్డి 81వ జయంతి వేడుకలు సోమవారం ఆమనగల్లులో ఘనంగా నిర్వహించారు.

విలువల వైతాళికుడు జైపాల్‌రెడ్డి
ఆమనగల్లు: జైపాల్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న శ్రీనివాస్‌ రెడ్డి, శ్రీనివా్‌సగౌడ్‌, రాములు, తదితరులు

ఆమనగల్లు/మాడ్గుల, జనవరి16: కేంద్ర మాజీ మంత్రి, ఉత్తమ పార్లమెంటేరియన్‌ గ్రహీత సూదిని జైపాల్‌రెడ్డి 81వ జయంతి వేడుకలు సోమవారం ఆమనగల్లులో ఘనంగా నిర్వహించారు. డీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ జడ్పీటీసీ శ్రీపాతి శ్రీనివా్‌సరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్‌, యువజన కాంగ్రెస్‌, ఎన్‌ఎ్‌సయూఐ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. టీపీసీసీ సభ్యుడు ఆయిళ్ల శ్రీనివా్‌సగౌడ్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నేనావత్‌ బీక్యానాయక్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు మండ్లీ రాములు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జైపాల్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విలువల వైతాళికుడు సూదిని జైపాల్‌రెడ్డి అని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు చేగూరి వెంకటేశ్‌, జవహార్‌లాల్‌ నాయక్‌, శ్రీశైలం, మానయ్య, ఎంఏ ఖలీల్‌, హీరాసింగ్‌, రాంచందర్‌ నాయక్‌, శ్రీకాంత్‌, ఖాదర్‌, కరీం, కృష్ణయ్య, నంద్యనాయక్‌, కొండల్‌రెడ్డి, యాదయ్యగౌడ్‌, ఫరీద్‌, మహేశ్‌, జహంగీర్‌, తోట శ్రీను పాల్గొన్నారు. అదేవిధంగా మాడ్గుల మండలంలోని తహసీల్దార్‌ కార్యాలయ సమీపంలో జైపాల్‌రెడ్డి జయంతిని పురస్కరించుకొని ఆమనగల్లు మాజీ మార్కెట్‌ చైర్మన్‌ భట్టు కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గౌరవరం పద్మ, వారి కుటుంబీకులు బీఆర్‌ఎస్‌ మాడ్గుల మండల అధ్యక్షులు ఏమిరెడ్డి జైపాల్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ యాదయ్యగౌడ్‌, మాజీ సింగిల్‌విండో అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, జంగయ్య, పాండుగౌడ్‌, లక్ష్మమ్మ, దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2023-01-16T23:05:26+05:30 IST