టీడీపీలో చేరిక
ABN , First Publish Date - 2023-06-22T23:52:03+05:30 IST
కులకచర్ల మండలానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, న్యాయవాది సీహెచ్.బాలముకుందం టీడీపీలో చేరారు.

కులకచర్ల, జూన్ 22: కులకచర్ల మండలానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, న్యాయవాది సీహెచ్.బాలముకుందం టీడీపీలో చేరారు. హైదరాబాద్‌లోని టీడీపీ భవన్‌లో గురువారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పరిగిలో టీడీపీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. తనపై నమ్మకంతో పార్టీలో చేర్చుకున్న కాసాని జ్ఞానేశ్వర్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. బాలముకుందం గతంలో టీడీపీ నుంచి కాంగ్రె్‌సలో చేరారు. తిరిగి సొంత గూటికి వచ్చారు. ఈ కార్యక్రమంలో పరిగి టీడీపీ నాయకులు మాణిక్యం, విజయభాస్కర్‌గౌడ్, వెంకటేశ్ పాల్గొన్నారు.