మేడ్చల్‌ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో నెంబర్‌వన్‌గా చేస్తా

ABN , First Publish Date - 2023-07-29T23:43:59+05:30 IST

మేడ్చల్‌ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో నెంబర్‌వన్‌గా చేస్తానని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. మండల పరిధి ఎదులాబాద్‌, అంకుషాపూర్‌, అవుషాపూర్‌ గ్రామాల్లో మంత్రి మల్లారెడ్డి శనివారం సుడిగాలి పర్యటన చేశారు.

మేడ్చల్‌ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో  నెంబర్‌వన్‌గా చేస్తా
నాలాను పరిశీలిస్తున్న మంత్రి మల్లారెడ్డి

కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి

ఘట్‌కేసర్‌ రూరల్‌, జూలై 29 : మేడ్చల్‌ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో నెంబర్‌వన్‌గా చేస్తానని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. మండల పరిధి ఎదులాబాద్‌, అంకుషాపూర్‌, అవుషాపూర్‌ గ్రామాల్లో మంత్రి మల్లారెడ్డి శనివారం సుడిగాలి పర్యటన చేశారు. తన సొంత నిధులతో చేపట్టిన సీసీరోడ్లు, కులసంఘ భవనాలను పరిశీలించారు. ఎదులాబాద్‌లో ఎస్సీ కమ్యునిటీ హాల్‌ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాలలో మౌలికసదుపాయాల కల్పనే లక్ష్యంగా పని చేస్తున్నట్లు గుర్తు చేశారు. సొంత నిధులతో నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు కాలేరు సురేష్‌, కొమ్మిడి జలజాసత్యనారాయణరెడ్డి, ఓరుగంటి వెంకటే్‌షగౌడ్‌, కొంతం వెంకట్‌రెడ్డి, వంగూరి శివశంకర్‌, ఉపసర్పంచ్‌లు ఉప్పు లింగేశ్వర్‌రావు, అయిలయ్యయాదవ్‌, చింతకింది బాలమణి, నాయకులు మల్లారెడ్డి, చామకూర భద్రారెడ్డి, నాగులపల్లి రమేష్‌, కార్యదర్శి పన్నాల కొండల్‌రెడ్డి, పాల్గొన్నారు. కాగా మండల పరిధి కొర్రెములకు చెందిన మానసకు మంత్రి మల్లారెడ్డి లక్ష రూపాయాల సీఎం రిలీ్‌ఫఫండ్‌ చెక్కును అందజేశారు.

ముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు

కీసర రూరల్‌ : ముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి మల్లారెడ్డి అన్నారు. శనివారం నాగారం మున్సిపాలిటీలో ఉన్సిపల్‌ చైర్మన్‌ కౌకుంట్ల చంద్రారెడ్డి, మున్సిపల్‌ అధికారులతో కలిసి ముంపుకు గురైన కాలనీల్లో పర్యటించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రధానంగా వరద ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో వైస్‌చైర్మన్‌ మల్లే్‌షయాదవ్‌, కౌన్సిలర్లు బిజ్జ శ్రీనివాస్‌, పంగ హరిబాబు, కౌకుంట్ల అనంతరెడ్డి, కో-ఆప్షన్‌ సభ్యులు, కమిషనర్‌ రాజేంద్రకుమార్‌, డీఈఈ రఘు, మేనేజర్‌ చద్రశేఖర్‌, నాయకులు గూడూరు ఆంజనేయులుగౌడ్‌, కౌకుంట్ల కృష్ణారెడ్డి, అన్నంరాజ్‌ సురేష్‌, సాయినాథ్‌గౌడ్‌, నిమ్మల శ్రీనివాస్‌, వామన్‌పాల్గొన్నారు. కాగా ముంపు సమస్య శాశ్శత పరిష్కారానికి బాక్స్‌ టైప్‌ డ్రైనేజీ కాలువను ప్రధాన రహదారి గుండానే నిర్మించాలని కాలనీ వాసులు మంత్రికి వివరించారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - 2023-07-29T23:43:59+05:30 IST