ఆర్టిజన్‌ కార్మికుల సమ్మెకు సహకరించాలి

ABN , First Publish Date - 2023-04-25T00:36:32+05:30 IST

తెలంగాణ విద్యుత్‌ ఆర్టిజన్‌, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మంగళవారం నుంచి చేపడుతున్న నిరవధిక సమ్మెకు కార్మికులు, విద్యుత్‌ వినియోగదారులు సహకరించాలని తెలంగాణ విద్యుత్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి కావలి వెంకటేష్‌ కోరారు.

ఆర్టిజన్‌ కార్మికుల సమ్మెకు సహకరించాలి
మాట్లాడుతున్న వెంకటేష్‌

షాద్‌నగర్‌ అర్బన్‌, ఏప్రిల్‌ 24: తెలంగాణ విద్యుత్‌ ఆర్టిజన్‌, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మంగళవారం నుంచి చేపడుతున్న నిరవధిక సమ్మెకు కార్మికులు, విద్యుత్‌ వినియోగదారులు సహకరించాలని తెలంగాణ విద్యుత్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి కావలి వెంకటేష్‌ కోరారు. సోమవారం షాద్‌నగర్‌లో అర్జిజన్ల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్న కార్మికులు ఆర్టిజన్లు మాత్రమేనన్నారు. వేతనాలు పెంచకుండా యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

Updated Date - 2023-04-25T00:36:32+05:30 IST