సీఎంవో ముఖ్య కార్యదర్శిగా శేషాద్రి
ABN , First Publish Date - 2023-12-08T03:41:28+05:30 IST
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక.. రాష్ట్రంలో గురువారం ఐఏఎస్ తొలి నియామకం జరిగింది.

ముక్కుసూటి అధికారికి కీలక పోస్టు.. రెవెన్యూ వ్యవహారాల్లో అనుభవజ్ఞుడు
ఇంటెలిజెన్స్ చీఫ్‌గా శివధర్‌రెడ్డి.. 9వ తేదీ తర్వాత మరిన్ని బదిలీలు
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అనుమతి
లేకుండానే పలు అర్జీలకు ఆమోదం
ఇద్దరి సస్పెన్షన్.. కేసు నమోదు
ఆలస్యంగా వెలుగులోకి ఘటన
హైదరాబాద్, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక.. రాష్ట్రంలో గురువారం ఐఏఎస్ తొలి నియామకం జరిగింది. సీనియర్ ఐఏఎస్ వి.శేషాద్రిని ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) ముఖ్య కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. ఆయన ఇప్పటి వరకు సాధారణ పరిపాలనా శాఖ(జీఏడీ) కార్యదర్శి, సీఎంవో కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. శేషాద్రికి రెవెన్యూ చట్టాలు, భూ వ్యవహారాల్లో అపారమైన పరిజ్ఞానం, అవగాహన ఉంది. ముఖ్యంగా తెలంగాణలోని భూములు, రెవెన్యూ సంబంధిత వ్యవహారాలు ఆయనకు కొట్టిన పిండి. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూపొందించిన ‘ధరణి’ పోర్టల్‌లో ఆయన కీలక భాగస్వామి. అప్పట్లో కేంద్ర సర్వీసుల్లో ఉన్న శేషాద్రిని కేసీఆర్ రాష్ట్రానికి తెప్పించుకున్నారు. గతంలో ఆయన రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా, ఉమ్మడి రాష్ట్రంలో చిత్తూరు కలెక్టర్‌గా సేవలందించారు. ఆయన ఏనాడూ అవినీతి ఆరోపణలను ఎదుర్కోలేదు. పైగా ముక్కు సూటి మనషి అనే పేరుందని అధికారులు చెబుతుంటారు.
శేషాద్రికి కీలక బాధ్యతలను అప్పగించడాన్ని బట్టి.. సీఎం రేవంత్‌రెడ్డి ప్రాధాన్యతలను అర్థం చేసుకోవచ్చని వారు అంటున్నారు. రేవంత్‌రెడ్డి పలు సందర్భాల్లో ధరణి పోర్టల్‌పై ఆరోపణలు చేశారు. ఆ పోర్టల్‌ను సంస్కరిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. శేషాద్రికి ఆ బాధ్యతలను అప్పగించినట్లు స్పష్టమవుతోంది. కాగా.. రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్‌గా అదనపు డీజీ శివధర్‌రెడ్డిని నియమిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణకు చెందిన శివధర్‌రెడ్డి కూడా నిజాయితీపరుడని పేరు తెచ్చుకున్నారు. ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్, యాంటీ నక్సల్స్ ఇంటెలిజెన్స్ వింగ్-ఎ్‌సఐబీ, గ్రేహౌండ్స్, ఆక్టోపస్ వంటి విభాగాల్లో ఆయనకు మంచి అనుభవం ఉంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కూడా ఆయన ఐజీ ర్యాంకులో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా రెండేళ్లపాటు సేవలందించారు. హైదరాబాద్ పాతనగరంలో.. దక్షిణ మండలం డీసీపీగా ఆయన పనిచేసిన సమయంలో మతకల్లోలాలను సమర్థంగా నియంత్రించారు. ఈ కారణాలతో శివధర్‌రెడ్డికి కీలక పదవిని ఇచ్చినట్లు తెలుస్తోంది.
సోనియా గాంధీ బర్త్‌డే తర్వాత..
సోనియాగాంధీ జన్మదినం(ఈనెల 9) తర్వాత పోలీసు శాఖలో భారీగా బదిలీలు ఉంటాయని తెలుస్తోంది. డీజీపీ కార్యాలయం మొదలుకొని.. కమిషనర్, ఎస్పీలతోపాటు క్షేత్రస్థాయి అధికారుల బదిలీలు జరుగుతాయని సమాచారం. ఏసీబీ చీఫ్‌గా ఉన్న రవిగుప్తాను ఈసీ డీజీపీగా నియమించింది. టీఎ్‌సపీఏ డైరెక్టర్‌గా ఉన్న సందీప్ శాండిల్యను హైదరాబాద్ సీపీగా నియమించింది. దీంతో.. ఏసీబీ, టీఎ్‌సపీఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితోపాటు.. మరికొన్ని పోస్టుల్లో ఖాళీలున్నాయి. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఎస్పీ.. అంతకంటే ఎక్కువ ర్యాంకుల్లో ఉన్న ఐపీఎ్‌సలను భారీగా బదిలీ చేయనున్నట్లు స్పష్టమవుతోంది.