స్ఫూర్తిదాయకమైన చరిత్రను ప్రతిబింబించేలా 3కే రన్
ABN , First Publish Date - 2023-06-17T00:26:55+05:30 IST
తెలంగాణ అవతరణ స్ఫూర్తిదాయకమైన చరిత్రను ప్రతిబింబించేలా 3కే రన్ నిర్వహించినట్లు ఎస్పీ గాష్‌ఆలం అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ములుగు పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 3కే రన్‌ను ఎస్పీ గాష్‌ఆలం కలెక్టర్ కృష్ణఆదిత్యతో కలిసి ఏరియా ఆస్పత్రి నుంచి జెండా ఊపి ప్రారంభించారు.

ఎస్పీ గాష్‌ఆలం
పెద్దసంఖ్యలో పాల్గొన్న విద్యార్థినీ, విద్యార్థులు
ములుగు కలెక్టరేట్, జూన్ 16: తెలంగాణ అవతరణ స్ఫూర్తిదాయకమైన చరిత్రను ప్రతిబింబించేలా 3కే రన్ నిర్వహించినట్లు ఎస్పీ గాష్‌ఆలం అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ములుగు పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 3కే రన్‌ను ఎస్పీ గాష్‌ఆలం కలెక్టర్ కృష్ణఆదిత్యతో కలిసి ఏరియా ఆస్పత్రి నుంచి జెండా ఊపి ప్రారంభించారు. గట్టమ్మ దేవాలయం వరకు జరిగిన 3కే రన్‌లో అధికారులతో పాటు విద్యార్థినీ, విద్యార్థులు, ప్రజలు తెలంగాణ అవతరణ స్ఫూర్తిని, ఔన్నత్యాన్ని తలచుకుంటూ ఉత్సాహంగా పరుగెత్తి గమ్యాన్ని చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ గాష్‌ఆలం మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం సాధించడంలో తెలంగాణ ప్రజల దృఢసంకల్పం, కృషి, త్యాగం మరువలేనిదని అన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్ర సాధన స్ఫూర్తిదాయకమని కొనియాడారు. 3కే రన్ రాష్ట్రంలోని ప్రజల మధ్య ఐక్యతను, సమగ్రతను పెంపొందిస్తుందని, రాష్ట్ర ప్రగతి మరింతగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అనంతరం 3కే రన్‌లో ముందువరుసలో నిలిచిన 25 మందికి ఎస్పీ, కలెక్టర్ మెడల్స్ అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో ఓఎస్డీ అశోక్‌కుమార్, ఏటూరునాగారం ఏఎస్పీ సంకీర్త్, ములుగు డీఎస్పీ రవీందర్, డీసీఆర్‌బీ డీఎస్పీ సుభాష్‌బాబు, సీఐ మేకల రంజిత్‌కుమార్, వెంకటాపురం సీఐ శివప్రసాద్, పస్రా సీఐ శంకర్, ఎస్సైలు రాజు, శ్రీనివాస్, వెంకటనారాయణ, కిరణ్, కరుణాకర్‌రావు, తాహెర్‌బాబా, పవన్‌కుమార్, శ్రావణ్‌కుమార్, హరీష్, సురేష్, తిరుపతిరావు, వెంకటేశ్వర్‌రావు, నిర్మల, మధులిక, ప్రశాంత్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.