LIQUOR: బ్రాండెడ్..!
ABN , Publish Date - Sep 21 , 2024 | 12:16 AM
దుకాణాల్లో అవసరమైన బ్రాండ్లు లేవని మద్యం ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ సమయంలో వెళ్లినా డిస్‌ప్లేలో ఉన్న బ్రాండ్లు మాత్రమే మా దగ్గర ఉన్నాయి. బీర్లు అసలే లేవని దుకాణాల్లో పని చేసే సిబ్బంది సమాధానమిస్తున్నారు.
పక్కదారి పట్టిస్తున్న సిబ్బంది
ఉరవకొండ, సెప్టెంబరు 20: దుకాణాల్లో అవసరమైన బ్రాండ్లు లేవని మద్యం ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ సమయంలో వెళ్లినా డిస్‌ప్లేలో ఉన్న బ్రాండ్లు మాత్రమే మా దగ్గర ఉన్నాయి. బీర్లు అసలే లేవని దుకాణాల్లో పని చేసే సిబ్బంది సమాధానమిస్తున్నారు. బ్రాండ్లు ఏమీ లేనపుడు దుకాణాలను మూసివేస్తే సరిపోతుంది కదా అంటూ మందుబాబులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉరవకొండ మండల పరిధిలో ఉన్న నాలుగు మద్యం దుకాణాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అక్టోబరు 1నుంచి అమలు కానుంది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాలు తొలగించి పాత పద్ధతిలో ప్రైవేట్‌కు అప్పగించనున్నారు. దీంతో ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉండేది కొన్నిరోజులేనని భావిస్తూ, అక్కడున్న సిబ్బంది చేతి వాటం చూపి, ఎక్కువ డిమాండ్ ఉన్న బ్రాండ్లు మాయం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసే సిబ్బంది అంతా వైసీపీతో అంటకాగిన వారే కావడంతో ఆ పార్టీకి సంబంధించిన వారికే బ్రాండ్ మద్యం అమ్ముతున్నట్లు బహిరంగంగా విమర్శలు వినిపిస్తున్నాయి. బ్రాండెడ్ మద్యం దొరక్క పోవడంతో మద్యం ప్రియులు బార్‌ల వైపు పరుగులు పెడుతున్నారు. ఈ విషయంపై ఎక్సైజ్ సీఐ కిషోర్‌ని వివరణ కోరగా, మద్యం దుకాణాల్లో బ్రాండ్లు ఉన్నా అమ్మకపోతే అలాంటి వారిపైన చర్యలు తీసుకుంటామన్నారు.