TDP Leaders Criticize Jagan: జగన్ మైండ్ దొబ్బింది.. టీడీపీ నేతల ఫైర్
ABN , Publish Date - Apr 09 , 2025 | 01:18 PM
TDP Leaders Criticize Jagan: బీసీ పోలీస్ అధికారిపై జగన్ దారుణ పదజాలం ఉపయోగించారని.. సుధాకర్ యాదవ్‌పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. వారంలోపు క్షమాపణ చెప్పకపోతే.. జగన్ మీద రాజకీయ యుద్ధం చేస్తామని హెచ్చరించారు.

అనంతపురం, ఏప్రిల్ 9: ఏపీ ప్రభుత్వంపై, పోలీసులపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Former CM YS Jagan Mohan Reddy) చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు (TDP Leaders) తీవ్రంగా తప్పుబడుతున్నారు. జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. క్షమాపణలు చెప్పుకపోతే జగన్‌పై యుద్ధం తప్పదంటూ వార్నింగ్‌లు ఇచ్చారు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు (Kalava Srinivasulu) మాట్లాడుతూ.. ఎమ్మెల్యే హోదాలో ఉన్న వ్యక్తికి 1100 మంది పోలీసుల్ని కేటాయించారని.. హెలిప్యాడ్ వద్ద 200 మంది పోలీసులు ఉన్నా దూసుకొచ్చారన్నారు. పోలీసులపై రాళ్ల దాడి కూడా చేశారని తెలిపారు. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సైకోయిజంతో ఉన్నారో తెలుస్తోందన్నారు. లింగమయ్య హత్య కేసులో నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేశారన్నారు.
అదే విధంగా పోలీసులపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని కోరారు. బీసీ పోలీస్ అధికారిపై దారుణ పదజాలం ఉపయోగించారని.. సుధాకర్ యాదవ్‌పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వారంలోపు క్షమాపణ చెప్పకపోతే.. జగన్ మీద రాజకీయ యుద్ధం చేస్తామని హెచ్చరించారు. వీడియో కాల్స్ చేసినట్టు జగన్ దగ్గరున్న సాక్షాలేంటి అని ప్రశ్నించారు. బీసీలకు క్షమాపణ చెప్పకపోతే.. బీసీల ప్రతాపం చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. లింగమయ్య కుటుంబానికి ఇప్పటి వరకు ఏం సాయం చేశావ్ అని నిలదీశారు. బీసీల మరణాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటే ఎవరూ ఓర్వరన్నారు. జగన్ మైండ్ దొబ్బింది.. అతనింకా ఇంకా కోలుకోలేదంటూ కాల్వ శ్రీనివాసులు ఎద్దేవా చేశారు.
Andhrapradesh Division Act: పట్టాలెక్కనున్న అమరావతి హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే
ఓర్వలేకే అరాచకాలు: కళ్యాణదుర్గం ఎమ్మెల్యే
ప్రశాంతంగా ఉన్న జిల్లాలో జగన్ అలజడులు సృషించారని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగుబోతులంతా కలిసి హెలికాప్టర్ వద్దకు దూసుకొచ్చారన్నారు. ఒక బీసీ నేత చనిపోవడం చాలా బాధాకరమని అన్నారు. ప్రజాస్వామ్యయుతంగా పాలన సాగుతుంటే జగన్ ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి పెట్టుబడులు కూడా వస్తున్నాయని.. ఇలాంటి సమయంలో జగన్ అరాచకాలు సృష్టిస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. జగన్ ఐదేళ్ల పాలనలో పోలీస్ వ్యవస్థను ఎంత దుర్వినియోగం చేశారో అందరికీ తెలుసన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తానని కలలు కంటున్నారని.. ఇలాంటి సైకోని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా లేరని ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేశారు.
ముందు తల్లికి, చెల్లెళ్లకు న్యాయం చెయ్: దగ్గుపాటి ప్రసాద్
వైసీపీ అధినేత జగన్ పర్యటనపై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ విరుచుకుపడ్డారు. కిరాయి గూండాల తరహాలో వైసీపీ కార్యకర్తలు వ్యవహరించారన్నారు. 1100 మంది పోలీస్ సిబ్బంది సెక్యూరిటీ ఉన్నారని.. హెలికాప్టర్ వద్ద 200మంది పోలీసులు ఉన్నా దూసుకొచ్చారని అన్నారు. రామగిరికి వచ్చి సేఫ్‌గా రిటర్న్ అయ్యావంటే పోలీసులే కారణమని తెలిపారు. ఒక మహిళా ఎస్పీ ఉన్న చోట.. పోలీసుల బట్టలూడదీస్తానంటావా అంటూ మండిపడ్డారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడుతావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నీకు మొదటి నుంచి శవ రాజకీయలు చేయడం అలవాటు. ఎక్కడ శవం ఉంటే అక్కడ వచ్చి వాలుతుంటావ్. ఒక బీసీ నేతను రాజకీయంగా వాడుకున్నావ్. మీ బాబాయ్ హత్యను కూడా చివరకు రాజకీయంగా వాడుకున్నావ్. ముందు మీ తల్లి, చెల్లెళ్లకు న్యాయం చెయ్’ అంటూ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హితవుపలికారు.
త్వరలోనే జగన్ డ్రస్ మారుతుంది: భాను ప్రకాష్
తిరుపతి: పోలీసులు లేకుండా ఒక అడుగు కూడా వేయని, వేయలేని జగన్ పోలీసుల గురించి కించపరచటం దారుణమని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి అన్నారు. పోలీసు వ్యవస్థను కించపరిచినందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని... ఆ మాటలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బట్టలు విప్పదీస్తామంటున్నాడని.. ఆయన బట్టలు ఉతుక్కోవటానికి మాత్రమే శేష జీవితం సరిపోతోందంటూ వ్యాఖ్యలు చేశారు. అందుకే బట్టలు ఉతికే సోపులు, లిక్విడ్‌లు జగన్ ఎక్కడ ఉంటే అక్కడకు పంపుతున్నామంటూ ఎద్దేవా చేశారు. ఆయన రాజకీయనేత కాదని... ఫ్యాక్షన్ నేతలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పోలీసు సంఘం జగన్‌పై కేసు పెట్టాలని.. పెడతారని భావిస్తున్నామన్నారు. ఇండియన్ పోలిటికల్ సర్వీసుగా మార్చుకున్న వ్యక్తి జగన్ అని అన్నారు. రాబోయే రోజుల్లో జగన్ డ్రస్ మారుతుందని... ఆయనకు ప్రత్యేకంగా నెంబర్ త్వరలో వస్తుందంటూ భానుప్రకాష్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
Today Gold Rate: తగ్గిన బంగారం, వెండి ధరలు..
Karumuri: మీ ఇంటికి ఎంత దూరమో.. మా ఇంటికి కూడా అంతే దూరం
Read Latest AP News And Telugu News