Share News

GAUTAMI SHALI : ఎస్పీగా గౌతమి శాలి

ABN , Publish Date - May 19 , 2024 | 12:28 AM

జిల్లా ఎస్పీగా గౌతమి శాలి నియమితులయ్యారు. ఎస్పీ అమిత బర్దర్‌ను ఎన్నికల కమిషన సస్పెండ్‌ చేయడంతో ఆయన స్థానంలో కొత్త ఎస్పీని నియమించారు. విశాఖపట్నం ఏపీఎస్పీ 16వ బెటాలియన కమాండెంట్‌గా ఉన్న గౌతమి శాలి ఆదివారం బాధ్యతలు తీసుకుంటారని తెలిసింది. ఆమె స్వస్థలం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సమీపంలోని పెద్ద కన్నెలి. ఎస్వీ యూనివర్శిటీలో ఇంజనీరింగ్‌ చేశారు. 2014లో యూపీఎస్పీ పరీక్షల్లో 783 ర్యాంకు సాధించారు. కడప...

GAUTAMI SHALI  : ఎస్పీగా గౌతమి శాలి
Gautami Shali

కౌంటింగ్‌ నేపథ్యంలో ఉత్కంఠ

శాంతి భద్రతలు కొత్త ఎస్పీకి సవాలు

అనంతపురం క్రైం, మే 18: జిల్లా ఎస్పీగా గౌతమి శాలి నియమితులయ్యారు. ఎస్పీ అమిత బర్దర్‌ను ఎన్నికల కమిషన సస్పెండ్‌ చేయడంతో ఆయన స్థానంలో కొత్త ఎస్పీని నియమించారు. విశాఖపట్నం ఏపీఎస్పీ 16వ బెటాలియన కమాండెంట్‌గా ఉన్న గౌతమి శాలి ఆదివారం బాధ్యతలు తీసుకుంటారని తెలిసింది. ఆమె స్వస్థలం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సమీపంలోని పెద్ద కన్నెలి. ఎస్వీ యూనివర్శిటీలో ఇంజనీరింగ్‌ చేశారు. 2014లో యూపీఎస్పీ పరీక్షల్లో 783 ర్యాంకు సాధించారు. కడప జిల్లాలో ట్రైనీ ఏఎస్పీగా తొలి పోస్టింగ్‌ దక్కింది. అనంతరం విశాఖపట్నంలో


గ్రేహౌండ్స్‌ అసాల్ట్‌ కమాండర్‌గా, బొబ్బిలి ఏఎస్పీగా, కర్నూలు అడిషనల్‌ ఎస్పీగా(అడ్మిన), కర్నూలు సెబ్‌ ఏఎస్పీగా, విశాఖపట్నం డీసీపీగా పనిచేశారు. ఎస్పీగా తొలిసారి అనకాపల్లిలో విధులు నిర్వర్తించారు.

కత్తి మీద సామే..

ఎన్నికల నేపథ్యంలో హింసాత్మక ఘటనలు కొనసాగుతున్న జిల్లాలో ఎస్పీగా బాధ్యతలు చేపట్టడం గౌతమి శాలికి సవాలుగా మారనుంది. ఎన్నికల నోటిఫికేషన వెలువడిన తరువాత వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఎస్పీ అన్బురాజనను బదిలీ చేశారు. ఆయన స్థానంలో వచ్చిన అమిత బర్దర్‌.. తాడిపత్రిలో అల్లరను నియంత్రించలేక పోయారన్న కారణంగా సస్పెండ్‌ అయ్యారు. మరో రెండు వారాల్లో కౌంటింగ్‌ జరగనుంది. ఆ తరువాత కూడా హింసాత్మక ఘటనలు జరగవచ్చని కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరించాయి. తాడిపత్రి సహా జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలు చాలానే ఉన్నాయి. కౌంటింగ్‌ అనంతరం గెలుపోటములను ప్రధాన పార్టీల మద్దతుదారులు ఎలా స్వీకరిస్తారోనన్న ఆందోళన సర్వత్రా నెలకొంది. జూన 19 వరకు అప్రమత్తంగా ఉండాలని నిఘా విభాగం ఇప్పటికే హెచ్చరికలు పంపింది. ఇలాంటి సమయంలో ఎస్పీగా వస్తున్న గౌతమి శాలి.. శాంతిభద్రతలను ఎలా కాపాడుతారో వేచి చూడాల్సిందే.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 19 , 2024 | 12:29 AM