Share News

Gurupurnami పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో గురు పౌర్ణమి వేడుకలు

ABN , Publish Date - Jul 21 , 2024 | 09:24 AM

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకలకు సర్వాంగ సుందరంగా పుట్టపర్తి ప్రశాంతి నిలయం ముస్తాబైంది. ఈ వేడుకల్లో పాల్గొనడానికి పుట్టపర్తి ప్రశాంతి నియానికి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల వచ్చారు.

Gurupurnami  పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో గురు పౌర్ణమి వేడుకలు

శ్రీ సత్యసాయి జిల్లా: దేశవ్యాప్తంగా గురుపౌర్ణమి (Gurupurnami) వేడుకలు (Celebrations) వైభవంగా జరుగుతున్నాయి. సాయిబాబా దేవాలయాలన్నీ (Sai Baba Temples) భక్తులతో (Devotees) కిటకిటలాడుతున్నాయి. ఆదివారం తెల్లవారు జామునుంచే ఆలయాలకు భక్తులు క్యూ కట్టారు. గురుపౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని సాయినాథుడి ఆలయాలన్నీ భక్తులతో రద్దీగా మారాయి. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకలకు సర్వాంగ సుందరంగా పుట్టపర్తి ప్రశాంతి నిలయం ముస్తాబైంది. ఈ వేడుకల్లో పాల్గొనడానికి పుట్టపర్తి ప్రశాంతి నియానికి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల వచ్చారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు సత్యసాయి ట్రస్ట్ ప్రతినిధులు, కలెక్టర్ చేతన్, ఎస్పీ రత్న తదితరులు ఘన స్వాగతం పలికారు. సత్యసాయి బాబా మహాసమాధి దర్శనార్థం వేలాదిగా దేశ విదేశీ భక్తులు తరలి వచ్చారు.


తెలంగాణలోని హైదరాబాద్, దిల్‌సుఖ్‌నగర్‌, కరీంనగర్‌, వరంగల్‌.. వివిధ ప్రాంతాల్లోని సాయి బాబా ఆలయాల్లో వైభవంగా గురుపౌర్ణమి వేడుకలు జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాలకు వెళ్లి బాబాను దర్శించుకుంటున్నారు. మహారాష్ట్రలోని షిరిడీ సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి షిరిడీకి వచ్చిన భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.


విశాఖలో

సాయిబాబా ఆలయాల్లో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచి బాబాకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. షిరిడి సాయి బాబా మందిరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.


తనకల్లు మండలకేంద్రంలోని షిర్టీ సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం చేస్తున్నామన్నారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. బాబా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.


నల్లమాడ మండల కేంద్రంలోని సాయి బాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆయల కమిటీ సభ్యులు, పెద్దలు తెలిపారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పూలతో ముస్తాబు చేశారు. భక్తులు అధికసంఖ్యలో బాబాను దర్శించుకోవాలని కోరారు. భక్తులకు అన్నదానం నిర్వహించనున్నట్లు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నేడు ఢిల్లీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి

శాంతి అవినీతిపై ఆరా!

ప్రతి రూపాయీ రాబట్టండి

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 21 , 2024 | 09:24 AM