Share News

TDP: జాకీ పరిశ్రమ స్థాపించాలన్నదే ఎమ్మెల్యే లక్ష్యం

ABN , Publish Date - Nov 23 , 2024 | 12:25 AM

నియోజకవర్గ కేంద్రంలో జాకీ పరిశ్రమ, ఇతర ఏదైనా పరిశ్రమ స్థాపించి యువతకు ఉపాధి కల్పించాలన్నదే ఎమ్మెల్యే పరిటాల సునీత లక్ష్యం అని టీడీపీ నాయకులు అన్నారు.

TDP: జాకీ పరిశ్రమ స్థాపించాలన్నదే ఎమ్మెల్యే లక్ష్యం
TDP leaders speaking at the place reserved for jockey industry

రాప్తాడు, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గ కేంద్రంలో జాకీ పరిశ్రమ, ఇతర ఏదైనా పరిశ్రమ స్థాపించి యువతకు ఉపాధి కల్పించాలన్నదే ఎమ్మెల్యే పరిటాల సునీత లక్ష్యం అని టీడీపీ నాయకులు అన్నారు. అసెంబ్లీ సమావేశంలో రాప్తాడులో జాకీ పరిశ్రమ స్థాపించాలని ఎమ్మెల్యే ప్రస్తావించడంతో శుక్రవారం రాప్తాడులో టీడీపీ నాయకులు హర్షం తెలిపారు. గతంలో జాకీ పరిశ్రమ కోసం కేటాయించిన స్థలాన్ని నాయకులు పరిశీలించారు. వారు మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో 10 వేల మందికి ఉపాధి లభించే జాకీ పరిశ్రమ మంజూరైతే 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో అప్పటి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డి, అతని సోదరులు రూ.15 కోట్లు జాకీ నిర్వాహకులను డిమాండ్‌ చేశారు. దీంతో పరిశ్రమ తెలంగాణకు తరలిపోయిందన్నారు. అసెంబ్లీలో రాప్తాడులో ఏదైనా పరిశ్రమ నిర్మించాలని ఎమ్మెల్యే ప్రస్తావించడం అభినందనీయమన్నారు. మండల కన్వీనర్‌ కొండప్ప, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, సర్పంచ సాకే తిరుపాలు, మాజీ కన్వీనర్‌ నారాయణస్వామి, గోనిపట్ల శీనా, బాబయ్య, కిష్టా పాల్గొన్నారు.

Updated Date - Nov 23 , 2024 | 12:25 AM