AP Elections 2024: బాలయ్య ..మజాకా.. పెద్దిరెడ్డి పరార్ ..!
ABN, Publish Date - Jun 01 , 2024 | 06:16 PM
తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)ని ఓడించాలనే పట్టుదలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) వ్యూహత్మకంగా పావులు కదిపారు. హిందూపురంలో ఓటమి ఎరుగని సైకిల్ పార్టీకి చెక్ పెట్టేందుకు భారీ స్కెచ్ వేశారు.
హిందూపురం: తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)ని ఓడించాలనే పట్టుదలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) వ్యూహత్మకంగా పావులు కదిపారు. హిందూపురంలో ఓటమి ఎరుగని సైకిల్ పార్టీకి చెక్ పెట్టేందుకు భారీ స్కెచ్ వేశారు. నియోజకవర్గంలో వైసీపీ (YSRCP) జెండా ఎగురవేయాలని మిషన్ హిందూపుర్ పేరుతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి (Minister Peddireddy Ramachandra Reddy) బాధ్యతలు అప్పగించింది వైసీపీ అధిష్ఠానం.
బీసీ కార్డు ప్రయోగం
ఈ నియోజకవర్గ సామాజిక నేతను కాదని కురుమ సామాజిక వర్గానికి చెందిన దీపికా రెడ్డిని బరిలోకి దింపింది. ఈమె కమ్యూనిటీని ఫోకస్ చేస్తూ బీసీ కార్డుని ప్రయోగించింది. దీపిక భర్తది రెడ్డి సామాజిక వర్గం కావడంతో ఆ వర్గం ఓట్లను కొట్టేయడానికి ప్లాన్ చేసింది. మంత్రి పెద్దిరెడ్డి తన పుంగనూరు నియోజకవర్గం కంటే హిందూపురంలోనే ఎక్కువ రోజులు ఉండి ప్రచారం చేశారు. గ్రామ పంచాయతీలు, వార్డుల్లోనూ ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
వైసీపీలో గ్రూపులు..
వైసీపీలో గ్రూపులు కట్టేవారిని హెచ్చరించి పార్టీ కోసం కష్టపడాలని హుకుం జారీ చేశారు, సామ , దాన, బేధ దండోపాయాలతో ముందుకు సాగిన హిందూపురంలో గ్రూపు రాజకీయాలను పెద్దిరెడ్డి ఆపలేకపోయారు.2014లో నవీన్ నిశ్చల్, 2019లో మైనార్టీ నేత ఇక్బాల్ పోటీ చేశారు. కానీ వీరిద్దరికి సఖ్యత లేకపోవడంతో హిందూపుర్ టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణపై (Balakrishna) విజయం సాధించలేకపోయారు.
ఇక్బాల్ టీడీపీలో చేరికతో...
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈనేతలద్దరిని పక్కన పెట్టి కురుమ సామాజిక వర్గానికి చెందిన దీపికను వైసీపీ అగ్ర నాయకత్వం బరిలోకి దింపింది. ఎమ్మెల్సీ ఇక్బాల్ ఫ్యాన్ పార్టీకి రాజీనామా చేసి బాలకృష్ణ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. నవీన్ నిశ్చల్ కూడా దీపికకు సరిగా సహకరించలేదని ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలన్ని టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు కలిసొచ్చాయనే భావిస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి బాలకృష్ణ విశేషంగా కృషి చేశారు. ఎంతో కాలంగా వేధిస్తున్న సాగునీటి సమస్యను పరిష్కరించారు.
నియోజకవర్గ ట్రాక్ రికార్ట్..
అలాగే ప్రభుత్వ ఆస్పత్రికి అధునాతన వైద్య పరికరాలను సమకూర్చారు. టీడీపీ హయాంలో బెంగళూరులోని పలు ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ పథకం అమలయ్యేలా కృషి చేశారు. బాలకృష్ణను గెలిపిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి సాధిస్తుందని ప్రజలు భావించారు. ప్రభుత్వ వ్యతిరేకత, నియోజకవర్గ ట్రాక్ రికార్ట్ బాలకృష్ణ సినీగ్లామర్ విజయానికి దోహదపడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చరిత్ర సృష్టించాలన్నా మేమే.. చర్రిత తిరగరాయాలన్నా మేమే అనే డైలాగ్ చెప్పిన బాలకృష్ణ... జూన్ 4వ తేదీన చరిత్ర సృష్టించడం ఖాయమని టీడీపీ శ్రేణులు భావిస్తు్న్నాయి. హిందూపురం ఫలితం ఎలాగా ఉంటుందో చూడాలి.
ఇవి కూడా చదవండి:
Gas leak: ఏర్పేడు సీఎంఆర్ కర్మాగారంలో గ్యాస్ లీక్.. బాధితులు ఎంతమందంటే..?
AP politics: కుప్పం నియోజకవర్గంలో మరోసారి రెచ్చిపోయిన వైసీపీ మూకలు..
Read Latest AP News and Telugu News
Updated Date - Jun 01 , 2024 | 06:23 PM