MLA : జవాబు దారీగా పనిచేయండి
ABN , Publish Date - Dec 18 , 2024 | 11:54 PM
గత వైసీపీ హయాంలో ఏ కార్యాలయంలోనూ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండేవారు కాదని, ఇప్పుడూ అలాగే వ్యవహరిస్తామంటే కుదరదని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. నిర్లక్ష్యం వీడి, ప్రజలకు జవాబుదారీ తనంతో పనిచేయాలని సూచించారు. మండలంలోని గంగినేపల్లిలో బుధవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సు లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ఎదుర్కొం టున్న భూసమస్యలపై పలువురు రైతులు ఎమ్మెల్యేకి అర్జీలు అందజేశారు.
అధికారులకు ఎమ్మెల్యే పరిటాల సునీత సూచన
చెన్నేకొత్తపల్లి, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ హయాంలో ఏ కార్యాలయంలోనూ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండేవారు కాదని, ఇప్పుడూ అలాగే వ్యవహరిస్తామంటే కుదరదని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. నిర్లక్ష్యం వీడి, ప్రజలకు జవాబుదారీ తనంతో పనిచేయాలని సూచించారు. మండలంలోని గంగినేపల్లిలో బుధవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సు లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ఎదుర్కొం టున్న భూసమస్యలపై పలువురు రైతులు ఎమ్మెల్యేకి అర్జీలు అందజేశారు. కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎమ్మె ల్యే మాట్లాడుతూ... మాజీ మంత్రినైనా తాను కార్యాల యాలకు వెళ్లినా గత వైసీపీ ప్రభుత్వంలో అఽధికారులు కనిపించకుండా పోయేవారన్నారు. .ముఖ్యమంత్రి చంద్ర బాబు మంచి ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారిని, అయితే కొందరు అధికారులు గతంలో మాదిరిగానే ని ర్లక్ష్యంగా ఉన్నారని అసహనం వ్యక్తం చేశారు. ఈ సదస్సులో తహసీల్దార్ సురేశకుమార్, ఎంపీడీ ఓ శివశంకరప్ప, ఈఓఆర్‌డీ అశోక్‌నాయక్, టీడీపీ సీని యర్ నాయకుడు ఎల్ నారాయణచౌదరి, బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు కుంటిమద్ది రంగయ్య, టీడీపీ మండల కన్వీనర్ ముత్యాల్‌రెడ్డి, .జిల్లా ఉపాధ్యక్షుడు దండు ఓబుళేశు, మాజీ ఎంపీపీ అంకే అమరేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంలోనే గంగనపల్లికి చెందిన పలువురు రైతు లు, గ్రామానికి తారు రోడ్డు చాలా దారుణంగా ఉం దని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. తాను రెవెన్యూ సదస్సుకు వస్తూ రోడ్డు పరిస్థితిని చూశానని ఎమ్మెల్యే అన్నారు. గ్రామానికి నూతనంగా తారురోడ్డు వేసిన తరువాతే గ్రామానికి వస్తానని ఎమ్మెల్యే తెలుపగా గ్రామస్థులు హర్షం వ్యక్తంచేశారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....