AP Politics: ఒక్క ఛాన్స్ అన్న వైసీపీకి ఇంకా నో ఛాన్స్.. కూటమి నేతల మాస్ కౌంటర్..
ABN, Publish Date - Apr 04 , 2024 | 07:41 PM
Andhra Pradesh News: జగన్ విముక్త ఆంధ్రప్రదేశే తమ కూటమి లక్ష్యం అని పాలకొల్లు(Palakollu) విపక్ష నేతలు స్పష్టం చేశారు. ఒక్క ఛాన్స్.. ఒక్క ఛాన్స్ అన్న వైసీపీకి(YCP) ఇంకా నో ఛాన్స్.. అని తేల్చి చెప్పారు. జనాల చేతిలో వైసీపీ చావుదెబ్బ తినడం ఖాయం అన్నారు. పాలకొల్లులో శుక్రవారం సాయంత్రం జరగబోయే చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) రోడ్ షో కోసం భారీ ఏర్పాట్లు..
Andhra Pradesh News: జగన్ విముక్త ఆంధ్రప్రదేశే తమ కూటమి లక్ష్యం అని పాలకొల్లు(Palakollu) విపక్ష నేతలు స్పష్టం చేశారు. ఒక్క ఛాన్స్.. ఒక్క ఛాన్స్ అన్న వైసీపీకి(YCP) ఇంకా నో ఛాన్స్.. అని తేల్చి చెప్పారు. జనాల చేతిలో వైసీపీ చావుదెబ్బ తినడం ఖాయం అన్నారు. పాలకొల్లులో శుక్రవారం సాయంత్రం జరగబోయే చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) రోడ్ షో కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు విపక్ష కూటమి నేతలు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్‌ఛార్జి బోణం చినబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కీలక వివరాలు వెల్లడించారు.
శుక్రవారం సాయంత్రం 6 గంటలకు చంద్రబాబు నాయుడు రోడ్ షో, భారీ బహిరంగ సభ ఉంటుందని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు తెలిపారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు కూటమి నేతలు. పాలకొల్లు ఫైర్ స్టేషన్ సెంటర్ నుంచి గాంధీబొమ్మల సెంటర్ వరకు చంద్రబాబు రోడ్ షో ఉంటుందన్నారు. ప్రజాగళం సభను విజయవంతం చేయడానికి రైతులు, యువకులు, నిరుద్యోగులు కదిలి వస్తారని చెప్పారు. మహిళలు స్వచ్ఛందంగా గడపగడప నుంచి బయటకు వచ్చి కదం తొక్కుతారన్నారు.
Also Read: కేజ్రీవాల్ అరెస్ట్.. ఆ విమర్శలకు చెక్ పెట్టిన అమెరికా
ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వం పాలనా విధానాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు విపక్ష నేతలు. బీసీలకు ఉన్న 34 శాతం రిజర్వేషన్‌లో 10 శాతం తగ్గించి 26 వేల రాజకీయ పోస్టులు పోగొట్టారని ఆరోపించారు. తెలుగుదేశానికి పాలకొల్లు నియోజకవర్గం కంచుకోట అని.. ఇప్పుడు జనసేన, బీజెపీ తోడు కావడంతో మరింత బలపడిందన్నారు. శుక్రవారం పాలకొల్లులో చంద్రబాబుకు ఘన స్వాగతం పలుకుతామని చెప్పారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు. రూ. 12 లక్షల కోట్లు అప్పులు చేశారన్నారు. జగన్ విముక్త ఆంధ్రప్రదేశే తమ కూటమి లక్ష్యంగా చెప్పారు నేతలు. ఒక్క ఛాన్స్.. ఒక్క ఛాన్స్ అన్న వైసీపీకి ఇంకా నో ఛాన్స్.. అని, ఈ ఎన్నికల్లో జగన్ తట్టాబుట్టా సర్దుకోవాల్సిందేనని చెప్పారు.
ఇవికూడా చదవండి:
వైసీపీకి బిగ్ షాక్.. మరో కీలక నేత జంప్..!
వైసీపీ డీఎన్ఏలో శవ రాజకీయం.. సీఎం జగన్‌పై చంద్రబాబు ఫైర్
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
Updated Date - Apr 04 , 2024 | 07:41 PM