ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: తిరుమల సీఎం చంద్రబాబు పర్యటనలో స్వల్ప మార్పు

ABN, Publish Date - Oct 04 , 2024 | 10:06 AM

తిరుమలకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ(శుక్రవారం) రానున్నారు. అయితే సీఎం చంద్రబాబు పర్యటనలో స్వల్ప మార్పులుచోటుచేసుకున్నాయి. ఈరోజు సాయంత్రం 5.30 గంటలకే తిరుమలకు చంద్రబాబు. వస్తారు. 5.30 నుంచి 7.30 గంటల వరకు పద్మావతి అతిథి గృహంలోనే చంద్రబాబు ఉండనున్నారు.

తిరుమల: తిరుమలకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ(శుక్రవారం) రానున్నారు. అయితే సీఎం చంద్రబాబు పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఈరోజు సాయంత్రం 5.30 గంటలకే తిరుమలకు చంద్రబాబు. వస్తారు. 5.30 నుంచి 7.30 గంటల వరకు పద్మావతి అతిథి గృహంలోనే చంద్రబాబు ఉండనున్నారు. 7.30 గంటలకు పద్మావతి అతిథి గృహం నుంచి బయలుదేరి బేడీ ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు చంద్రబాబు దంపతులు చేరుకోనున్నారు.


రాత్రి 8గంటలకు పట్టు వస్త్రాలతో బేడీ ఆంజనేయ స్వామి ఆలయం నుంచి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకొని పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. శ్రీవారిని దర్శించుకుని..ఆలయం వెలుపల ఉన్న వాహన మండపంలో పెద్ద శేష వాహన సేవలో చంద్రబాబు దంపతులు పాల్గొననున్నారు. రాత్రి 9.30 గంటలకు పద్మావతి అతిథిగృహానికి చేరుకుని సీఎం అక్కడే బస చేయనున్నారు. రేపు ఉదయం 7.30 గంటలకు 13.5 కోట్లతో టీటీడీ నిర్మించిన వకుళమాత వంట శాలను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.


వైభవంగా బ్రహ్మోత్సవాలు

మరోవైపు.. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిన్న (గురువారం) అంకురార్పణ కార్యక్రమం వైభవంగా జరిగింది. స్వామి సర్వసేనాధిపతైన విష్వక్సేనుడు ఊరేగింపుగా మాడవీధిలో బ్రహ్మోత్సవ ఏర్పాట్లను చూస్తూ తిరిగి ఆలయానికి చేరుకున్న తర్వాత యాగశాలలో శాస్త్రోక్తంగా పలు కార్యక్రమాలను నిర్వహించారు. లలాట, బహు, సప్త పునీత ప్రదేశంలో భూమిపూజ జరిపారు. తొమ్మిది కుండల్లో శాలి, వ్రహి, యువ, ముద్గ, మాష, ప్రియంగు వంటి నవధాన్యాలను ఆ మట్టిలో కలిపి మొలకెత్తించే పనికి శ్రీకారం చుట్టారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ బీజావాపం కార్యక్రమంతో అంకురార్పణ సమాప్తమైంది. క్రమం తప్పకుండా నీరు పోస్తూ మొలకెత్తేలా అర్చకులు జాగ్రత్తగా చూసుకుంటారు.


ఇక, శుక్రవారం సాయంత్రం ధ్వజరోహణం జరగనుంది. ఈ క్రతువుతో బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాలు మొదలు కానున్నాయి. ఈ సందర్భంగా దేవేరులతో కూడిన మలయప్పకు ఉదయం బంగారు వాకిలిలో విశేష సమర్పణ చేస్తారు. సాయంత్రం యాగశాలలో నిర్వహించే సంప్రదాయ కార్యక్రమాలనంతరం ఉత్సవ వరులతో పాటు అనంత, గరుడ, చక్రత్తాళ్వార్‌, సేనాధిపతి, ధ్వజపటాన్ని మధ్యాహ్నం 3 గంటలకు నాలుగుమాడ వీధుల్లో ప్రదక్షిణంగా ఊరేగించి ఆలయానికి వేం చేస్తారు. సాయంత్రం 5.45 నుంచి 6 గంటల మధ్య మీన లగ్న ముహూర్తంలో ధ్వజారోహణం కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహిస్తారు. దీంతో వేంకటేశ్వర స్వామివారి వాహనసేవల వైభవ సంబరం ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగానే రాత్రి 9-11 గంటల నుంచి పెద్దశేషవాహనం మొదలుకుని 11వ తేదీ రాత్రి అశ్వవాహనం వరకు మాడవీధుల్లో వాహనసేవలు కనులపండువగా జరుగనున్నాయి. 12న ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

గాయత్రీ దేవి అలంకారంలో కనకదుర్గ అమ్మవారు..

భద్రాచలంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 04 , 2024 | 10:47 AM