Home Minister Anitha: వారి కోసమే రెడ్‌బుక్.. హోం మంత్రి అనిత మాస్ వార్నింగ్
ABN, Publish Date - Nov 03 , 2024 | 08:38 PM
మహిళల మరణాలకు కారణమయ్యే వారికి భయం క్రియేట్ అయ్యేలా వ్యవహరిస్తామని హోం మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. స్మార్ట్ పోలీసింగ్‌కు మరో మూడువేల సీపీ కెమెరాలు తిరుపతిలో ఏర్పాటుకు యత్నిస్తామని అన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టడానికి మళ్లీ టాస్క్ ఫోర్స్ రంగంలోకి వస్తోందని
తిరుపతి: నేరస్తులు సాంకేతికతను ఉపయోగించుకుని క్రైం చేస్తున్నారని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఇవాళ(ఆదివారం) తిరుపతిలో తిరుపతి, చిత్తూరు జిల్లాల పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాన్ని హోం మంత్రి వంగలపూడి అనిత నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సాంకేతికంగా పోలీసు శాఖను ఎలా బలోపేతం చేయాలి, క్రైంను ఎలా కంట్రోల్ చేయాలనే అంశాలపై వివరంగా చర్చించినట్లు హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు.
మహిళల మరణాలకు కారణమయ్యే వారికి భయం క్రియేట్ అయ్యేలా వ్యవహరిస్తామని హోం మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. స్మార్ట్ పోలీసింగ్‌కు మరో మూడువేల సీసీ కెమెరాలు తిరుపతిలో ఏర్పాటుకు యత్నిస్తామని అన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టడానికి మళ్లీ టాస్క్‌ఫోర్స్ రంగంలోకి వస్తోందని... ఇందుకోసం ద్రోన్‌లను కూడా వినియోగించనున్నామని తెలిపారు. ప్రొసిజర్ దాటి వెళ్లిన వారికే రెడ్‌బుక్ అని... వైసీపీ నేతలు అందరూ బుజాలు తడుముకోవాల్సిన పని లేదని అన్నారు. రూ.500 కోట్లు ఖర్చుపెట్టి రుషికొండపైన అంత విలాసవంతమైన భవనం ఎవరి కోసం కట్టుకున్నారని హోం మంత్రి వంగలపూడి అనిత ప్రశ్నించారు.
వైసీపీ నేతలు రాజకీయ రాబందుల్లా మారిపోయారు..
మహిళలు, చిన్న పిల్లలపై అత్యాచార ఘటనలను వైసీపీ నేతలు రాజకీయం కోసం వాడుకుంటున్నారని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఆ పార్టీ నేతలు రాజకీయ రాబందుల్లా మారిపోయారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కామాంధులు రెచ్చిపోయిన ప్రతి చోటకు చేరి వారిపై అఘాయిత్యాలను తమకు అనుకూలంగా వాడుకోవాలని చూస్తున్నారని హోంమంత్రి ధ్వజమెత్తారు.
వైసీపీ హయాంలో పోలీసు, సీసీ కెమెరాల వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని అనిత మండిపడ్డారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చి అధికార పార్టీపై అవాకులు, చవాకులు పేలిన వైసీపీ నేతలు షర్మిల వద్దకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. మహిళలకు అండగా ఉంటామని చెప్తున్న ఆ నాయకులంతా అన్న (జగన్) చేతిలో మోసపోయిన షర్మిలకు అండగా ఎందుకు నిలబడలేదని అనిత మండిపడ్డారు.
ఈ వార్తలు కూడా చదవండి:
AP Politics: చంద్రబాబు.. ప్రజా ముఖ్యమంత్రి
AP Politics: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మరో భారీ కుంభకోణం
Julakanti Brahmananda Reddy: మాచర్ల ఎమ్మెల్యే బావమరిదిపై దాడి..
For More AndhraPradesh News And Telugu News..
Updated Date - Nov 03 , 2024 | 08:43 PM