TTD: బాధ్యతలు చేపట్టిన టీటీడీ నూతన ఈవో శ్యామలరావు.. ఏమన్నారంటే..?
ABN, Publish Date - Jun 16 , 2024 | 04:54 PM
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా జే శ్యామలరావును (Syamala Rao) ఏపీ ప్రభుత్వం (AP Govt) నియమించిన విషయం తెలిసిందే. ఈరోజు(ఆదివారం) గరుడాళ్వార్ సన్నిధిలో ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. తిరుమల..క్షేత్ర సంప్రదాయం ప్రకారం వరహాస్వామిని దర్శించుకున్నారు.
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఈవోగా జే శ్యామలరావును (Syamala Rao) ఏపీ ప్రభుత్వం (AP Govt) నియమించిన విషయం తెలిసిందే. ఈరోజు(ఆదివారం) గరుడాళ్వార్ సన్నిధిలో ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. తిరుమల (Tirumala)..క్షేత్ర సంప్రదాయం ప్రకారం వరహాస్వామిని దర్శించుకున్నారు. ఈవో ఎఫ్ఏసీ ధర్మారెడ్డి నూతన ఈవోకు బాధ్యతలు అప్పగించారు. రేపటి(సోమవారం) వరకు సెలవుపై ఉన్నప్పటికీ ఈవోకీ బాధ్యతలు అప్పగించేందుకు తిరుమలకు ధర్మారెడ్డి వచ్చారు. అనంతరం శ్రీవారిని టీటీడీ నూతన ఈవో శ్యామలరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఈవో శ్యామలరావు మీడియాతో మాట్లాడారు.
టీటీడీలో మంచి పరిపాలన జరిగేలా చర్యలు..
‘‘హిందువులకు పవిత్రమైన దేవాలయం తిరుమల. నిత్యం ప్రపంచం నలుమూలల నుంచి స్వామి వారీ దర్శనార్థం భక్తులు తిరుమలకు తరలివస్తారు. టీటీడీకీ ఈఓగా రావడం నా అదృష్టం. శ్రీవారి ఆశీస్సులతో నాకు తిరుమలలో సేవ చేసే భాగ్యం దక్కింది. నాకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు. టీటీడీలో మంచి పరిపాలన జరిగేలా చర్యలు తీసుకుంటాం. ప్రపంచంలో అత్యంత ధనిక ఆలయం తిరుమల. జవాబు దారి తనంతో విధులు నిర్వర్తిస్తా. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం. స్వామి వారీ దర్శనార్థం వచ్చే ప్రతి భక్తుడు సంతోషంగా వెళ్లేలా ఏర్పాట్లు చేస్తాం. స్వామి వారీ కైంకర్యాలు సక్రమంగా నిర్వహించడంతో పాటు భక్తులకు ఇబ్బంది కలగకుండా సౌకర్యాలు కల్పిస్తాం’’ అని టీటీడీ ఈవో శ్యామలరావు పేర్కొన్నారు.
కాగా.. ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న శ్యామలరావును టీటీడీ ఈవోగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం టీటీడీ ఈవోగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ధర్మారెడ్డిని ఆ పోస్టు నుంచి రిలీవ్ కావాలని ఉత్తర్వుల్లో వెల్లడించారు. వాస్తవానికి ధర్మారెడ్డిని గత ప్రభుత్వం టీటీడీ అదనపు ఈవోగా నియమించింది. ఆ తర్వాత ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. వైసీపీ ప్రభుత్వం ఓటమి తర్వాత జగన్మోహన్‌రెడ్డికి అత్యంత సన్నిహితంగా ధర్మారెడ్డి మేలిగారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయన్ను ఈవోగా తప్పించి శ్యామలరావుకు టీటీడీ ఈవోగా ఏపీ ప్రభుత్వం నియమించింది.
ఈ వార్తలు కూడా చదవండి
Amaravati: ఆదివారమైనా తగ్గేదే లే.. లోకేష్ తీరుపై ప్రజల హర్షం..
YS Sharmila: ఫాదర్స్ డే సందర్భంగా షర్మిల భావోద్వేగ పోస్ట్..
Kodali Nani: చంద్రబాబు కాళ్ల వద్ద కొడాలి నాని.. గుంటూరులో ఫ్లెక్సీ..!
Updated Date - Jun 16 , 2024 | 05:43 PM