ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TTD: భక్తులకు అలర్ట్... టీటీడీ కీలక నిర్ణయాలు

ABN, Publish Date - Dec 22 , 2024 | 01:59 PM

తిరుపతి డెవలప్‌మెంట్‌పై టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు టీటీడీ ఈవో శ్యామలరావు కీలక ప్రకటన చేశారు. తిరుమల పవిత్రతను కాపాడే విదంగా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.

తిరుమల: తిరుమల అన్ని క్షేత్రాలకు రోల్ మాడల్‌గా ఉండేలా అభివృద్ధి చేస్తామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. గత ఆరు నెలలుగా తిరుమలలో భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై మార్పులు చేశామని చెప్పారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తిరుపతిలో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నామని అన్నారు. తిరుమల పవిత్రతను కాపాడే విదంగా చర్యలు తీసుకున్నామని వివరించారు.. టీటీడీ కల్పించే సేవలు భక్తులకు గుర్తుండేలా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. క్యూలైన్ మెనెజ్మెంట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టి..భక్తులు క్యూ లైనల్లో అధిక సమయం వేచి ఉండకుండా మార్పులు చేశామని తెలిపారు.అన్నప్రసాదాలు,లడ్డు నాణ్యత పెంచామని అన్నారు. తిరుమలలో దాతలు నిర్మించిన 45 అతిథి గృహాలు పేర్లలో మార్పులు చేయాలని చెప్పారు.


సీఎం ఆదేశాలతో తిరుమల విజన్‌తో ప్రత్యేక ప్రణాళికని రూపొందిస్తున్నామని అన్నారు. తిరుమలలో ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చెందాలని చెప్పారు.. 2019లో తుడా మాస్టర్ ప్లాన్ కింది తిరుమల ఉంది అని గుర్తుచేశారు. తుడా ప్లాన్‌ని డెవలప్ చేసి తిరుమలని అభివృద్ధి చేస్తామన్నారు. నిపుణులైన కంపెనీలతో చర్చించి తిరుమల విజన్ ప్లాన్‌ని తయ్యారు చేస్తామని అన్నారు. కాలినడక మార్గాలు సరిగ్గా లేవు..వాటిని అభివృద్ధి చేయాలన్నారు. తిరుమలలో మల్టీ లెవల్ పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కొత్తరోడ్డులు,లింక్ రోడ్ల విస్తరణ చేయాలన్నారు.


కొన్ని ప్రదేశాలను పునర్ నిర్మాణం చేయాలని చెప్పారు. బస్టాండు మార్పు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. అలిపిరి వద్ద ఉన్న 42 ఎకరాల్లో బెస్ క్యాంపు ఏర్పాటు చేయాలన్నారు. తిరుమలకు వాహనాలు అధికంగా వస్తున్నాయని...వీటిని నియంత్రించాలని అన్నారు. అర్బన్ డిజైన్ గైడ్ లైన్స్ ప్రకారం నిర్మాణాలు చేపట్టాలని చెప్పారు. నాన్ హిందూ ఉద్యోగులపై టీటీడీ బోర్డు మేరకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అన్యమత ఉద్యోగులను ఇతర శాఖలకు పంపడం..లేక వీఆర్ఎస్ ఇప్పిస్తామన్నారు. ప్రసాదాల తయ్యారికి నాణ్యమైన నెయ్యిని వినియోగిస్తామని చెప్పారు. త్వరలోనే టీటీడీ నూతన ల్యాబ్ అందుబాటులోకీ వస్తుందని తెలిపారు. టీటీడీ క్రింద 61 ఆలయాలు ఉన్నాయి..వాటిని అభివృద్ధి చేస్తామన్నారు.


అనుబంధ ఆలయాలను అభివృద్ధి చేయడానికి నిపుణులు సూచనలు కోరామని అన్నారు..తిరుచానూరులోని మాడ వీధుల్లో సమస్యలు ఉన్నాయని టీటీడీ ఈవో శ్యామలరావు పేర్కొన్నారు. ఆకాశగంగ,పాపవినాశనం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. ఆల్ హిందూ ధార్మిక ప్రాజెక్ట్‌లో రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. కొన్ని లోపాలు గుర్తించాం..గత మూడు సంవత్సరాల జరిగిన కార్యక్రమాలపై ఆడిట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. నిపుణుల కమిటీ వేసి ధార్మిక కార్యక్రమాల పై సూనచలు స్వీకరిస్తున్నామని అన్నారు. చాగంటి కోటేశ్వరరావు ద్వారా యువతలో భక్తి భావన పెంచేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజి వ్యవస్థలో సరైన ప్లాన్ లేదు..వాటిపై కూడా భవిష్యత్తులో ప్లాన్ రెడీ చేస్తున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు.

Updated Date - Dec 22 , 2024 | 02:08 PM