ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections: వైసీపీ మరో నాటకం.. ఇంటెలిజెన్స్ బ్యూరో పేరిట ఫేక్ సర్వే..

ABN, Publish Date - Apr 10 , 2024 | 09:51 PM

ఏపీలో ఎన్నికల వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. ఓవైపు వైసీపీపై పూర్తి వ్యతిరేకత ఉందని అన్ని వార్తా సంస్థలు, రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు పలు సర్వే సంస్థలు విడుదల చేసిన ఓపీనియన్ పోల్‌లో కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి గెలుపు అవకాశాలు ఉన్నాయని తేలింది. ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో ఇంటెలిజెన్స్ బ్యూరో సర్వే అంటూ ఓ రిపోర్టు వైరల్ అవుతోంది.

ఏపీలో ఎన్నికల వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. ఓవైపు వైసీపీపై పూర్తి వ్యతిరేకత ఉందని అన్ని వార్తా సంస్థలు, రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు పలు సర్వే సంస్థలు విడుదల చేసిన ఓపీనియన్ పోల్‌లో కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి గెలుపు అవకాశాలు ఉన్నాయని తేలింది. ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో ఇంటెలిజెన్స్ బ్యూరో సర్వే అంటూ ఓ రిపోర్టు వైరల్ అవుతోంది. అసెంబ్లీలో వైసీపీకి 118 నుంచి 124 సీట్లు వస్తాయని, ఎన్డీయే కూటమికి 48 నుంచి 51 సీట్లు వస్తాయని, కాంగ్రెస్ జీరో నుంచి ఒక సీటు గెలిచే అవకాశం ఉన్నట్లు ఈ సర్వే రిపోర్టులో ఉంది. వైసీపీకి 49 నుంచి 51 శాతం ఓట్లు, ఎన్డీయే కూటమికి 41 నుంచి 45 శాతం ఓట్లు, కాంగ్రెస్‌కు 1 నుంచి 3 శాతం, ఇతరులకు సున్నా నుంచి ఒక శాతం ఓట్లు వస్తాయని ఈ సర్వే పేర్కొంది. మార్చి2వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ మధ్య ఈ సర్వే చేసినట్లు ఆ సర్వేలో ఉంది.

Kollu Ravindra: పీఎస్‌పై దుమ్మీకి వెళ్లిన పేర్ని నానిపై కేసు పెట్టాల్సిందే..

ఫేక్ సర్వే..

కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో పేరిట వైరల్ అవుతున్న సర్వేతో తమకు సంబంధం లేదని, తాము ఎలాంటి సర్వే నివేదికలు విడుదల చేయలేదని కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో క్లారిటీ ఇచ్చింది. దీంతో ఇది ఫేక్ సర్వేగా తేలింది. వైసీపీకి చెందిన కొందరు సోషల్ మీడియాలో దీనిని వైరల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజలను మభ్య పెట్టేందుకు రోజుకో కుట్రకు తెరలేపుతున్న వైసీపీ తాజాగా ఐబీ పేరిట ఓ నకిలీ సర్వేను వైరల్ చేస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజలెవరూ ఈ సర్వేను నమ్మవద్దని, ఇది ఫేక్ అని కేంద్ర నిఘా సంస్థ వెల్లడించింది. మరోవైపు ఫేక్ సర్వేలను వైరల్ చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్య వాదులు కోరుతున్నారు. ఇలాంటి ఫేక్ సర్వేలను ప్రచారం చేస్తున్నవారిపై కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిఉంది.

TDP: నీకు ఓటు అడిగే అర్హత ఉందా?... జగన్‌పై కన్నా విసుర్లు

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 10 , 2024 | 09:51 PM

Advertising
Advertising