సంపూర్ణ పారిశుధ్యంతో ఆరోగ్యమైన సమాజం
ABN , Publish Date - Sep 18 , 2024 | 12:01 AM
పెద్దాపురం, సెప్టెంబరు 17: ఆరోగ్యవంతమైన సమాజానికి ప్రతీ ఒక్కరూ తమ తోడ్పాటునుందిం చాలని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మంగళవారం పట్టణంలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొని జంక్షన్‌లో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ సం పూర్ణ పారిశుధ్యంతోనే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజాప్రతి
ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప
పెద్దాపురం, సెప్టెంబరు 17: ఆరోగ్యవంతమైన సమాజానికి ప్రతీ ఒక్కరూ తమ తోడ్పాటునుందిం చాలని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మంగళవారం పట్టణంలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొని జంక్షన్‌లో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ సం పూర్ణ పారిశుధ్యంతోనే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజాప్రతినిధులు, ప్రజలను భాగస్వాము లను చేసి పట్టణాలు, గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దుకోవాలన్నారు. రహదారులపై చెత్తను చీపు ర్లతో ఊడ్చారు. స్వచ్ఛతా హీ సేవా ప్రతిజ్ఞ చేశా రు.విద్యార్థులు మానవహారంగా ఏర్పడ్డారు. కార్య క్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బొడ్డు తులసీ మంగతాయారు, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజాసూ రిబాబురాజు, మున్సిపల్ కమిషనర్ కేవీ పద్మావతి, శానిటరీ ఇనస్పెక్టర్ దావీదురాజు, కర్రి వెంటకర మణ, తూతిక రాజు పాల్గొన్నారు. స్థానిక వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో విశ్వకర్మ జయంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దివిలి గ్రామంలో వినాయక చవితి ఉత్సవాల ముగింపు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్తిం వెంక టశ్రీనివాసరావు (కోటి), మొయిళ్ల కృష్ణమూర్తి, మత్తాల రాజు, ఎగ్గాడ శ్రీను తదితరులు ఉన్నారు.