పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములవ్వాలి
ABN , Publish Date - Sep 01 , 2024 | 12:11 AM
పెద్దాపురం, ఆగస్టు 31: పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే నిమ్మ కాయల చినరాజప్ప అన్నారు. పట్టణంలో జగ్గంపేట రహదారిలో నిర్వహించిన వనం మనం కార్యక్రమం లో ఆయన శనివారం మొక్కలు నాటారు. అనం తరం మాట్లాడుతూ రోజురోజుకూ పెరిగిపో
ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప
పెద్దాపురం, ఆగస్టు 31: పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే నిమ్మ కాయల చినరాజప్ప అన్నారు. పట్టణంలో జగ్గంపేట రహదారిలో నిర్వహించిన వనం మనం కార్యక్రమం లో ఆయన శనివారం మొక్కలు నాటారు. అనం తరం మాట్లాడుతూ రోజురోజుకూ పెరిగిపోతున్న వా తావరణ కాలుష్యం బారి నుంచి కాపాడుకునేందుకు ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. కాలుష్యం కారణంగా అనేక దుష్ప్రభావాలు కలుగుతున్నాయని, మనవంతు బాధ్యతగా ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రభు త్వం సైతం పర్యావరణ పరిరక్షణకు ఎంతో కృషి చే స్తూ మొక్కలు సరఫరా చేయడం చేస్తుందన్నారు. స్థానిక 26,28 వార్డుల్లో పలువురికి ఎన్టీఆర్‌భరోసా పింఛన్లను ఆయన పంపిణీ చేశారు. కార్యక్రమంలో జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామ స్వామి (బాబు), టీడీపీ నేతలు రాజాసూరిబాబు రాజు, మహ్మద్ అరీఫ్ ఆలీ, తూతిక రాజు, మున్సిపల్ కమిషనర్ కేవీ పద్మావతి పాల్గొన్నారు.