Raghurama: ఆయనకు ఏడేళ్లు కఠిన కారాగార శిక్ష పడాలి... రఘురామ షాకింగ్ కామెంట్స్
ABN, Publish Date - Jun 21 , 2024 | 04:05 PM
మాజీ సీఎం జగన్ గురించి ఆయన ఎక్కువగా ఊహించుకుంటున్నారని.. ఆయనకు అంత సీన్ లేదని మొన్నటి ఎన్నికల్లో తెలిసిపోయిందని ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణం రాజు (Kanumuru Raghu Rama Krishna Raju) వ్యంగ్యస్త్రాలు గుప్పించారు.
అమరావతి: మాజీ సీఎం జగన్ గురించి ఆయన ఎక్కువగా ఊహించుకుంటున్నారని.. ఆయనకు అంత సీన్ లేదని మొన్నటి ఎన్నికల్లో తెలిసిపోయిందని ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణం రాజు (Kanumuru Raghu Rama Krishna Raju) వ్యంగ్యస్త్రాలు గుప్పించారు. జగన్ ఓదార్పు యాత్ర ఎందుకని.. ఆయన ఎవర్నీ ఒదరుస్తారని.. ఆయననే ప్రజలు ఒదర్చాలని ఎద్దేవా చేశారు.వైసీపీ కార్యకర్తలపై దాడులు, అధికారులను బదిలీ చేస్తున్నారని జగన్ అంటున్నారని... కార్యకర్తలపై ఒకటి రెండు చోట్ల దాడులు జరిగాయని అంటున్నారని.. అది వ్యక్తిగత కక్షలు కానీ పార్టీ విబేధాలు కాదని స్పష్టం చేశారు.
ALSO READ: CM Chandrababu: సీఎంగానే అసెంబ్లీలో అడుగు పెడతానన్న చంద్రబాబు.. సుదీర్ఘ కాలం తర్వాత..
జగన్ ఎందుకో తెగ బాధపడి పోతున్నారని దెప్పిపొడిచారు. మరి ముగ్గురు టీడీపీ కార్యకర్తలను ఫలితాలు వచ్చిన తర్వాత వైసీపీ మూకలు చంపేశారని మండిపడ్డారు. మరి దానికీ జగన్ ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. ఆయన చేసినట్టు అంత అధ్వానమైన పరిపాలన చేయరని మండిపడ్డారు. మరి వైసీపీ హయాంలో చేసిన దాడులు, హక్కులు హననం ఇంకా ఎప్పుడు జరగదని చెప్పారు. తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన అధికారికి ఇంకా పూర్తి శిక్ష పడలేదని అన్నారు.
ALSO READ: CM Ramesh: అవినీతిపై విచారణ చేపట్టాలని సీఎం చంద్రబాబును కోరాం
ఆయనకు ఏడేళ్లు కఠిన కారాగార శిక్ష పడాలని... అప్పుడే ఆ అధికారికి శిక్ష పడినట్టు అవుతుందని చెప్పుకొచ్చారు జగన్ దెబ్బకు ఆర్థికంగా మూడేళ్లు పూర్తి అధ్వాన్నంగా ఉందని విమర్శలు చేశారు. మరో మూడేళ్లు కోలుకునే పరిస్థితి లేదని అన్నారు. అందుకనే నియోజకవర్గంలో స్వచ్ఛందంగా పనులు చేపట్టేందుకు విరాళాలు అడిగానని చెప్పారు. ప్రజల్లో ఎన్డీఏ పాలనపై మంచి స్పందన కనిపిస్తుందని అన్నారు. ఐదేళ్లు ఆయన ఎలా కళ్లు మూసుకుని తెరుస్తారో ఆయనకే తెలియాలని రఘరామ చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి
Chandrababu : సుచరిత హత్యపై స్పందించిన సీఎం చంద్రబాబు.. హోంమంత్రికి కీలక ఆదేశాలు
Pawan Kalyan: రియల్ హీరో అనిపించుకున్న పవన్ కల్యాణ్.. అసెంబ్లీలో ఆసక్తికర దృశ్యం
Nara Bhuvaneshwari: ప్రజలకు ప్రణామం అంటూ భువనేశ్వరి ట్వీట్
Read more AP News and Telugu News
Updated Date - Jun 21 , 2024 | 04:42 PM