AP Elections 2024:ఆ ఆస్తులను ఎన్నికల అఫిడవిట్‌లో చూపించని జగన్.. టీడీపీ నేత సూటి ప్రశ్న
ABN, Publish Date - May 05 , 2024 | 04:25 PM
హైదరాబాద్‌లో ఉన్న లోటస్ పాండ్, బెంగుళూరులో ఉన్న ప్యాలెస్, మాల్‌ను ఎన్నికల అఫిడవిట్‌లో సీఎం జగన్ రెడ్డి ( CM Jagan) ఎందుకు చూపించలేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి (Anam Venkata Ramana Reddy) ప్రశ్నించారు. టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...స్థిరాస్తులే లేని జగన్ కుటుంబానికి లక్షలాది కోట్లా ఆస్తులా.. ? అవి ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు.
అమరావతి: హైదరాబాద్‌లో ఉన్న లోటస్ పాండ్, బెంగుళూరులో ఉన్న ప్యాలెస్, మాల్‌ను ఎన్నికల అఫిడవిట్‌లో సీఎం జగన్ రెడ్డి ( CM Jagan) ఎందుకు చూపించలేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి (Anam Venkata Ramana Reddy) ప్రశ్నించారు. టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...స్థిరాస్తులే లేని జగన్ కుటుంబానికి లక్షలాది కోట్లా ఆస్తులా.. ? అవి ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు. జగన్ రెడ్డికి ఆయన తండ్రి ఒక్క స్థిరాస్తి కూడా ఇవ్వలేదంట.. అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తులు మరి జగన్‌కు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. జగన్ రెడ్డికి కానుకలుగా ఆస్తులును ఇచ్చిన రాజశేఖర్ రెడ్డి.. షర్మిలకు ఎందుకు ఇవ్వలేదు ? అని నిలదీశారు.
CM Ramesh: వైసీపీ దౌర్జన్యాలకు భయపడేది లేదు..
జగన్ రెడ్డిపై 32 క్రిమినల్ కేసులు... అన్నీ మనీలాండరింగ్ కేసులే ఉన్నాయని చెప్పారు. వైఎస్సార్ సీఎం అయ్యాక లక్షల కోట్ల జనం సొమ్ములను జగన్ కొట్టేశారని ఆరోపించారు. జగన్ కంపెనీలు అన్నీ ప్రైవేట్ కంపెనీలేనని... ఒక్కటి కూడా లిమిటెడ్ కంపెనీ లేదని తేల్చిచెప్పారు.లిమిటెడ్ కంపెనీలైతే జగన్ గుట్టు బయట పడుతుందన్న భయం ఆయనకు ఉందన్నారు. 19 ఏళ్ల క్రితం పెట్టిన పెట్టుబడి ధరనే చూపిస్తూ జనాలను జగన్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అప్పటి పెట్టుబడుల విలువ.. ఇప్పటి అసలు విలువ చూస్తే రూ. 1,458 కోట్ల పైనే ఉంటుందని ఆనం వెంకట రామణారెడ్డి అన్నారు.
AP Elections: ఎన్నికల ముందు మరో కుట్ర.. చంద్రబాబు, లోకేశ్‌పై కేసు!!
Read Latest Andhra pradesh News or Telugu News
Updated Date - May 05 , 2024 | 04:27 PM