Atchannaidu: గులకరాయి డ్రామాకు దర్శకత్వం వహించినవారికి తగిన రీతిలో సన్మానం... అచ్చెన్న వార్నింగ్
ABN, Publish Date - Apr 20 , 2024 | 04:27 PM
Andhrapradesh: గులకరాయి కేసులో కావాలనే బోండా ఉమాను వేధిస్తున్నారని ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీయే కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేసిన బోండా ఉమాను జగన్ కావాలనే వేధిస్తున్నారన్నారు. సీపీ ప్రకటనపై ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. అధికారులు ఎన్నికల నిభంధనల ఉల్లంఘనలపై ఇప్పటికే గవర్న్‌కు ఫిర్యాదు చేశామని..
అమరావతి, ఏప్రిల్ 20: గులకరాయి కేసులో కావాలనే బోండా ఉమాను (TDP leader Bonda Uma) వేధిస్తున్నారని ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు (AP TDP Chief Atchannaidu) ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీయే కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేసిన బోండా ఉమాను జగన్ (CM Jagan) కావాలనే వేధిస్తున్నారన్నారు. సీపీ ప్రకటనపై ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. అధికారులు ఎన్నికల నిభంధనల ఉల్లంఘనలపై ఇప్పటికే గవర్న్‌కు ఫిర్యాదు చేశామని.. దీనిపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు.
AP Elections: వైసీపీకి ఓటమి భయం.. ఎంపీ అభ్యర్థిని మార్చే యోచనలో జగన్!
ఎమ్మెల్యే అభ్యర్దిని వేధించటంపై హైకోర్టు ఛీప్ జస్టిస్, ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తామన్నారు. వేధింపులు ఆపకపోతే అధికారులు భవిష్యత్ లో మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. జగన్ చెప్పినట్టు ఆడి తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని అధికారులకు హితవుపలికారు. మరో నెల రోజుల్లో ఎన్డీయే ప్రభుత్వం వస్తుందని... గులకరాయి డ్రామా గూడు పుఠానీ బయటపెడతామని స్పష్టం చేశారు. ఈ డ్రామాకు కథ, స్రీన్ ప్లే, దర్శకత్వం వహించని వారికి తగిన రీతిలో సన్మానం చేస్తామని అచ్చెన్నాయుడు వార్నింగ్ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి...
Lokesh: జగన్ రెడ్డి గారి జమానాలో నిజాలు చెప్పడమే నేరమా?!
Chandrababu: ఆడబిడ్డలను ప్రపంచంలోనే శక్తివంతులుగా చేసే బాధ్యత నాది..
మరిన్ని ఏపీ వార్తల కోసం...
Updated Date - Apr 20 , 2024 | 04:57 PM